అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్( Joe Biden ) తప్పుకుని రేసులోకి వచ్చిన భారత సంతతికి చెందిన కమలా హారిస్ తన హవా చూపిస్తున్నారు.అప్పటి వరకు ట్రంప్ వైపు మొగ్గుచూపిన సర్వేలు, ముందస్తు అంచనాలు సడెన్‌గా మారిపోయాయి.
ఎటు చూసినా కమలా హారిస్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.తన రన్నింగ్‌మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎంపిక చేసిన ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
![Telugu August, Democratic, Joe Biden, Kamala Harris, San Francisco, Trump, Presi Telugu August, Democratic, Joe Biden, Kamala Harris, San Francisco, Trump, Presi](https://telugustop.com/wp-content/uploads/2024/09/Funding-us-presidential-election-Kamala-Harris-August-Campaign-Funding-Trump-Joe-Biden.jpg)
ఇదిలాఉండగా.విరాళాల విషయంలోనూ డొనాల్డ్ ట్రంప్( Donald Trump )కు గట్టి పోటీనిస్తున్నారు కమల.ఆగస్ట్ నెలలో ట్రంప్ కంటే హారిస్( Kamala Harris )కు ఎక్కువ విరాళాలు వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.గత నెలలో 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల విరాళాలు ఆమెకు వచ్చాయి.
ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కేవలం 13 మిలియన్ డాలర్ల దగ్గర ఆగిపోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
![Telugu August, Democratic, Joe Biden, Kamala Harris, San Francisco, Trump, Presi Telugu August, Democratic, Joe Biden, Kamala Harris, San Francisco, Trump, Presi](https://telugustop.com/wp-content/uploads/2024/09/Funding-us-presidential-election-Democratic-Party-San-Francisco-Kamala-Harris-August-Campaign-Funding-Trump-Joe-Biden.jpg)
జో బైడెన్ తప్పుకున్నాక అధ్యక్ష అభ్యర్ధిగా నిలిచిన కమలా హారిస్.కేవలం ఏడు వారాల్లోనే నిధుల సేకరణలో ముందంజలో నిలిచారు.జూలైలో డెమొక్రాటిక్ పార్టీ( Democratic Party ) 310 మిలియన్ డాలర్లు సేకరిస్తే.
ఆగస్ట్‌లో కమల అంతకంటే ఎక్కువ నిధుల్ని రాబట్టడం విశేషం.అయితే గత నెలలో పెన్సిల్వేనియాలోని జార్జిటౌన్లో జరిగినర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ.
రిపబ్లికన్ పార్టీని విజయపథంలో నడిపించడానికి కావాల్సిన నిధులు తమ వద్ద ఉన్నాయన్నారు.ఇదే ఊపులో సెప్టెంబర్ నెలలోనూ మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరిన్ని విరాళాలు సొంతం చేసుకోవాలని కమలా హారిస్ భావిస్తున్నారు.
దీనిలో భాగంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో( San Francisco )లలో ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కలిసి 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తారని అంచనా.
ఇందుకోసమే భారీ ఎత్తున విరాళాలను సేకరించి.దాని సాయంతో ప్రచారం నిర్వహించనున్నారు.