రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండలంలోని గ్రామాలలో తిరుగుతూ మాయమాటలు చెప్పుతూ తక్కువ ధరకు రేషన్ బియ్యన్ని కొనుగోలు చేస్తున్న రేకుర్తి గ్రామానికి చెందిన పత్తి కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఈరోజు ఆటోలో తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఉదయం 8.00 గంటల ప్రాంతంలో ఇల్లంతకుంట ఎస్ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్,పోలీస్ సిబ్బందితో పొత్తూరు మానేర్ వంతెన వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి పత్తి కళ్యాణ్ పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం పక్కదారి పట్టించిన, అక్రమంగా తరలించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.