మర్యాద రామన్న సినిమా కాపీ నా.. సీన్ టూ సీన్ అచ్చుగుద్దారే..?

2010లో వచ్చిన తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా మూవీ “మర్యాద రామన్న( Maryada Ramanna )” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సలోని హీరోయిన్‌గా వచ్చిన ఈ మూవీ స్టోరీ చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది.

 Facts About Maryada Ramanna ,maryada Ramanna ,our Hospitality, Rajamouli, Salo-TeluguStop.com

సినిమా స్టార్ట్ అయిన సమయం నుంచి కామెడీ, సస్పెన్స్, ఎమోషన్స్, రొమాన్స్ అన్నీ ఉంటాయి.దీనికి ఎస్.

ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు.స్క్రీన్ ప్లే తానే రాశాడు.కథ సంభాషణలు S.S.కంచి అందించాడు.అయితే నిజానికి ఈ సినిమా తెలుగులో వచ్చిన ఒరిజినల్ మూవీ ఏం కాదు.ఇది ఒక కాపీ మూవీ.1923లో వచ్చిన మూకీ చిత్రం “అవర్ హాస్పిటాలిటీ( Our Hospitality )” నుంచి ఈ సినిమాని సీన్ టూ సీన్ కాపీ చేశారు.

Telugu Maryada Ramanna, Hospitality, Rajamouli, Saloni, Sunil, Tollywood-Movie

వాస్తవానికి ఆ మూవీ రీమేక్ చేసే రైట్స్ కొనుగోలు చేయాలని రాజమౌళి ట్రై చేశాడు.కానీ అది తీసిన నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లందరూ చనిపోయారు.అందువల్ల అఫీషియల్ రీమేక్ చేయలేకపోయాడు.

మర్యాద రామన్న సినిమాలో ఏ సన్నివేశాలు ఉన్నాయో ఈ మూకీ చిత్రంలో కూడా అవే సన్నివేశాలు ఉంటాయి.ఈ సినిమాలో చూపించినట్లే హీరో ఫ్యామిలీకి, మరొక ఫ్యామిలీకి పగలు ఉంటాయి.

ఆ విషయం తెలియని హీరో పగవాడి సహాయమే కోరతాడు.ఇంగ్లీషు మూవీలో హీరో తల్లి కొడుకుని న్యూయార్క్ తీసుకొని వస్తుంది.

తండ్రి లాగా పగవాడి ఫ్యామిలీ చేతిలో కుమారుడు చచ్చిపోకూడదని ఆమె భావిస్తుంది.అందుకే అలా చెప్తుంది.

తెలుగులో కూడా సునీల్ తల్లి అలానే అతన్ని వేరే సిటీలో పెంచుతుంది.పగల గురించి వెల్లడించదు.

Telugu Maryada Ramanna, Hospitality, Rajamouli, Saloni, Sunil, Tollywood-Movie

అయితే తల్లి చనిపోయిన చాలా రోజులకు పుట్టిన స్థలంలో ఫాదర్ ఎస్టేట్ ఒకటి తనకు లభించనుందని కొడుకు తెలుసుకుంటాడు.అక్కడ తనపై పగ పట్టిన ఎనిమీస్ ఉన్నారని తెలుసుకోలేక పోతాడు.అందుకే బర్త్ ప్లేస్‌కి తిరుగు ప్రయాణం చేస్తాడు.ట్రైన్ ప్రయాణంలో అతడికి హీరోయిన్ పరిచయం అవుతుంది.మర్యాద రామన్న సినిమాలో కూడా సేమ్ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది.ఇందులో సునీల్, సలోని ట్రైన్ లోనే కలుసుకుంటారు.

ఆ హీరోయిన్ పగవాడికి కూతురు అవుతుంది.ఆ పగవాడు ఇంటికి వెళ్లిన తర్వాత అతను పగవాడనే విషయం తెలుస్తుంది.

అమెరికన్ కామెడీ డ్రామాలు కూడా సేమ్ ఇదే స్టోరీ నడుస్తుంది.ఈ అమెరికన్ ఒరిజినల్ మూవీ 76 నిమిషాలు 8 రీల్స్ ఉంటుంది.

అయితే తెలుగు సినిమాలో పాటలు పెట్టి, కొంచెం కామెడీ జోడించి, తెలుగు నేటివిటీకి తగినట్లుగా తీసి హిట్‌ కొట్టారు రాజమౌళి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube