బైకులకు షెల్టర్ గా బస్ షెల్టర్...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు(ఎం) మండల( Athmakur (M) ) కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నేడు బైక్ పార్కింగ్ కు అడ్డాగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.పరిసర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు, పట్టణ ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఈ బస్టాండ్ లో వేచి చూసేవారని,కొత్తగా రోడ్డు నిర్మాణం చేయడంతో బస్టాండ్ కిందకు రోడ్డు పైకి అయిందని,అందులోకి వెళితే తలలకు తగులుతుండడంతో బయటే పిల్లాపాపలతో పాటు లగేజీతో ఎండకు, వానకు నిలబడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Bus Shelter As Shelter For Bikes...!, Bus Shelter , Bikes , Athmakur (m) , Yad-TeluguStop.com

పైగా అందులో ఉంటే వచ్చిపోయే వాహనాలు కనిపించడం లేదని అంటున్నారు.ప్రయాణికులు ఎండ,వానలో నిలబడలేక సమీపంలోని హోటళ్లను,షాపులను ఆశ్రయించక తప్పడం లేదని,ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళే వారు ఖాళీగా ఉండే బస్టాండ్ లో బైక్ పార్కింగ్ చేసి వెళ్లడానికి ఉపయోగపడుతుందని, ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులను గమనించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు,ప్రయాణికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube