ఆర్థిక స్వావలంబన.. స్వయం సమృద్ధికి దోహదం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన.స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas )పేర్కొన్నారు.

 Financial Self-reliance.. Contribute To Self-sufficiency, Financial Self-relianc-TeluguStop.com

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో(TSERP-DRDA) భాగంగా వెలుగు స్వయం స్వశక్తి సంఘం వారి ఆద్వర్యంలో రూ.మూడు లక్షల బ్యాంక్ రుణంతో శ్రీ లక్ష్మినరసింహా ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయగా, మర్రిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో ఎంటర్ప్రైజ్ రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.అలాగే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్ ను బ్యాంక్ లోన్ రూ.3 లక్షలు,  స్త్రీ నిధి నుంచి రూ.2 లక్షలతో సుజాత- లక్ష్మి కలిసి ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రితో కలిసి బుధవారం ప్రారంభించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని క్యాంటీన్లో టీ, ఆహారపదార్థాలు కొనుగోలు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలనే సద్ధుదేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.మిగితా వారికి ఆదర్శంగా నిలువాలని వివరించారు.పథకంలో భాగంగా జిల్లాలో మూడు యూనిట్లు ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు.రాష్ట్రంలోని కోటి మంది మహిళను కోటీశ్వరులు గా చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఏటా రూ.20 వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతతూ మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకుపోతున్నామని విప్ తెలిపారు.

జిల్లాలో ఇంచుమించు 9,985 మహిళా సంఘాలలోని 1,34,498 మంది సభ్యులు ఉన్న వారిలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 600 కోట్ల బ్యాంక్, స్త్రీ నిధి రుణాలు ఇప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు.ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు.

ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల కింద సహాయం చేయడం జరుగుతుందన్నారు.మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, ఎల్ డీ ఎం మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎంలు సుధారాణి పద్మయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి రజిత ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube