సినిమాల్లో స్టార్ యాక్టర్‌గా హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభమైన పనేం కాదు.కండలు తిరిగిన బాడీ, ఆకట్టుకునే అందం, ఆరడుగుల ఎత్తు, బీభత్సమైన ఆస్తి, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే సినిమాల్లో స్టార్ యాక్టర్ రేంజ్‌కు ఎదగలేని కొంతమంది నటులు ఉన్నారు.
వీళ్లు సినిమాల్లో సెటిల్ కావడానికి బాగానే ప్రయత్నించారు.చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేసి తమ అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ ప్రదర్శించారు.
కానీ లక్కు బాగోలేక వారికి రావాల్సిన పేరు రాలేదు.అలాంటి కొంతమంది అండర్‌రేటెడ్ యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.
• ఆది పినిశెట్టి
( Adi Pinishetti )
ఆది పినిశెట్టి తమిళ, తెలుగు చిత్రాలలో నటించి ఎంతగానో మెప్పించాడు.నంది అవార్డు కూడా అందుకున్నాడు.ఆది దర్శకుడు రవి రాజా పినిశెట్టికి తనయుడు అవుతాడు.2006లో ఒక ‘వి చిత్రమ్” సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమయ్యాడు.దర్శకుడు S.శంకర్ నిర్మించిన తమిళ చిత్రం “ఈరమ్ (2009)”తో హీరోగా అవతరించాడు.మళ్లీ “గుండెల్లో గోదారి” సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు.కానీ స్టార్ హీరో రేంజ్‌కు ఎదగలేకపోయాడు.సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌గా మాత్రమే యాక్ట్ చేశాడు.సోలోగా ఒక పెద్ద హిట్ కూడా కొట్టలేకపోయాడు.
![Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/09/Tollywood-most-under-rated-artistsb.jpg)
• శ్రీ విష్ణు
( Sri Vishnu )
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజా రాజా చోరా, ఓం భీమ్ బుష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో శ్రీ విష్ణు హీరోగా నటించిన అలరించాడు.అంతకుముందు ఆయన అనేక సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ అద్భుతంగా పోషించి వావ్ అనిపించాడు.అయినా కూడా ఈ హీరో స్టార్ హీరో రేంజ్‌కు వెళ్ళలేకపోయాడు.ఈ హీరో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.
• నాగ శౌర్య
( Naga Shaurya )
రొమాంటిక్ కామెడీ “ఊహలు గుసగుసలాడే” సినిమాతో నాగశౌర్య సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు.ఛలో సినిమాతో ఒక హిట్ కూడా కొట్టాడు.
కృష్ణ బృందా విహారి సినిమాతో చాలామందిని ఆకట్టుకున్నాడు.మంచిగా నటించగల ఈ హీరోకి రావాల్సిన గుర్తింపు రాలేదు.
![Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/09/Tollywood-most-under-rated-artistsc.jpg)
• నవీన్ చంద్ర
( Naveen Chandra )
రౌడీ, పోలీస్, హీరో ఇలా ఏ క్యారెక్టర్ లోనైనా బాగా నటించగల నవీన్ చంద్ర కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.
![Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie Telugu Adi Pinishetti, Naga Shaurya, Satyadev, Sri Vishnu, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/09/Tollywood-most-under-rated-artistsd.jpg)
• సత్యదేవ్
( Satyadev )
సత్యదేవ్ చాలా బాగా నటిస్తాడని సంగతి అందరికీ తెలిసిందే.గాడ్ ఫాదర్, తిమ్మరుసు: అసైన్‌మెంట్ వాలి మూవీ చూస్తే ఈ నటుడు వెంట టాలెంటెడ్ యాక్టరో అర్థమవుతుంది.కానీ దురదృష్టం కొద్దీ సత్యదేవ్ ఇతర స్టార్ హీరోల వలె పేరు తెచ్చుకోలేకపోయాడు.