అమెరికా అధ్యక్ష ఎన్నికలు ( US presidential election )హోరాహోరీగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
రెండ్రోజుల క్రితం ఆర్లింగ్టన్ నేషనల్ స్మశాన వాటికలో జరిగిన కార్యక్రమానికి ట్రంప్ ( Donald Trump )హాజరుకావడం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది.ఈ వ్యవహారంపై కమలా హారిస్ స్పందించారు.
డొనాల్డ్ ట్రంప్ పొలిటికల్ స్టంట్స్ చేస్తున్నారని.పవిత్రమైన భూమిని అగౌరవపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను తాము గౌరవిస్తామని , దీనిని తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని కమలా హారిస్(Kamala Harris) స్పష్టం చేశారు.ఆర్లింగ్టన్ నేషనల్ స్మశాన వాటిక రాజకీయాలు చేసుకునే ప్రదేశం కాదన్నారు.స్మశాన వాటికలో ట్రంప్ ఫోటోలు చేయడాన్ని ఆమె ఖండించారు.ట్రంప్‌కు ఇలా చేయడం కొత్త కాదని, మెడల్ ఆఫ్ హానర్( Medal of Honor ) గ్రహీతలను ఆయన అవమానించారని కమలా హారిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు తాను సేవ చేసుకోవడం తప్ప మరో విషయం ఆయనకు తెలియదని ఆమె ఫైర్ అయ్యారు.

కాగా.2021 ఆగస్ట్ 26న ఆఫ్ఘనిస్తాన్( Afghanistan)లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుడు చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 13 మంది యూఎస్ సైనికులు, 100 మందికి పైగా అఫ్గాన్‌లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలోనే ఆర్లింగ్టన్ నేషనల్ స్మశాన వాటికలో మృతి చెందిన సైనికులకునివాళులర్పించేందుకు , బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ అక్కడికి వెళ్లారు.ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రచార సిబ్బంది ఆయన ఫోటోలు తీసుకున్నారు.
దీనిపై ఆర్లింగ్టన్ స్మశాన వాటిక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయగా.ట్రంప్ సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు.
ఈ వివాదం నేపథ్యంలోనే కమలా హారిస్ ఎక్స్ వేదికగా స్పందించారు.మరి ఆమె వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.







