"ఇంత లేటుగా ఎందుకు చూశామా".. అని పశ్చాత్తాప పడేలా చేసే గ్రేటెస్ట్ మూవీస్..

సాధారణంగా మనం ఖాళీ సమయంలో ఏదో ఒక సినిమా చూస్తుంటాం.అది బాగోలేకపోతే అనవసరంగా మూడు గంటలు వేస్ట్ చేసామా అని బాధ పడిపోతాం.

 Tollywood Great Movies These Days Maidaan Music Shop Murthy Details, Maidaan, Mu-TeluguStop.com

కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా బాగుంటాయి.వాటిని అనుకోకుండా చూసినా సరే మనకి బాగా నచ్చేస్తాయి.

ఎన్ని రోజులు ఈ సినిమాని ఎందుకు చూడలేదు అబ్బా అనుకుంటూ మనం ఫీల్ అయిపోతాం కూడా.అలాంటి కొన్ని సినిమాల్లో ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.అవేవో తెలుసుకుందాం.

• మైదాన్

Telugu Ajay Devgan, Ajay Ghosh, Amazon Prime, Maidaan, Watch, Tollywood-Movie

మైదాన్( Maidaan ) బయోలాజికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం.ఈ సినిమా భారతదేశంలో 1952 నుంచి 1962 సంవత్సరాల మధ్య కాలంలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీం అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీసారు.ఈ సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది.

సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగన్( Ajay Devgan ) నటించారు.ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయింది కానీ ఓటీటీలో చాలామందిని ఆకట్టుకుంది.

దీని గురించి చాలా గొప్పగా రివ్యూలు ఇచ్చారు.ఇందులో ఫుట్‌బాల్ గురించి చూపించిన తీరు కూడా చాలా మందిని ఆకట్టుకుంది.

ఈ సినిమాలో చూపించిన ఫుట్‌బాల్ విజువల్స్ మైండ్ లో నుంచి అంత త్వరగా పోవు.అంత ఇంపాక్ట్ చూపించింది.

ఇండియన్ ఫుట్‌బాల్ ప్లేయర్లపై ఒక గౌరవం కూడా పెరిగిపోతుంది.

ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.ఇది 2024, జూన్ 5న ఓటీటీలో రిలీజ్ అయింది.

• మ్యూజిక్‌షాప్‌ మూర్తి

Telugu Ajay Devgan, Ajay Ghosh, Amazon Prime, Maidaan, Watch, Tollywood-Movie

అజయ్ ఘోష్,( Ajay Ghosh ) చాందిని చౌదరి( Chandini Chowdary ) ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ డ్రామా ఫిల్మ్ మ్యూజిక్ షాప్ మూర్తి (2024)( Music Shop Murthy ) చాలామందిని ఆకట్టుకుంది.దీనికి శివ పాలడుగు రచించి దర్శకత్వం వహించారు.అజయ్ ఘోష్ అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచాడు.

ఆయన చెప్పిన డైలాగులు వాస్తవమే కదా అని ఆలోచింపజేస్తాయి.ఇదొక హార్ట్‌ఫెల్ట్ డ్రామా, మస్ట్ వాచ్ మూవీ అనే సినిమా క్రిటిక్స్ కూడా కామెంట్లు చేశారు.

హైటెక్నికల్ వాల్యూస్, అద్భుతమైన స్టోరీ వల్ల ఈ మూవీ ఎంజాయ్‌బుల్ వాచ్ అయింది.ఈ సినిమా చూస్తే కన్నీళ్లు కూడా వస్తాయి దీన్ని తప్పకుండా చూడమని చూసిన తర్వాత ఎవరైనా సరే రికమెండ్ చేయకుండా ఉండలేరు.

ఇది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube