మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

రాజన్న సిరిసిల్ల జిల్లా: మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.మిడ్ మానేర్ ముంపు గ్రామాలు ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, కొడుముంజ, అనుపురం, శభాష్ పల్లి, చింతల్ ఠాణా, చీర్లవంచ, గుర్రంవాణిపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులతో చీర్లవంచలో శనివారం సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

 Efforts To Solve The Problems Of Residents Of Flooded Villages In Mid Maneru, R-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ ఇండ్లకు పరిహారం, పట్టాలు, 18 ఏండ్లు నిండిన వారికి పరిహారం, ఆలయాలకు పరిహారం రాలేదని ఇతర సమస్యలను ప్రభుత్వ విప్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

తమ గ్రామాలకు సరిహద్దులు చూపాలని, ఆక్రమణలు నిరోధించాలని, స్మశాన వాటికల వద్ద సమస్యలను పరిష్కరించాలని, పలువురు రియల్ ఎస్టేట్ నిర్వాహకులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.ముంపు గ్రామాల పరిధిలో వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లకు అనుమతులు ఉన్నాయా? డీటీసీపీ అనుమతి ఉందా లేదా తెలుసుకోవాలని, ప్రభుత్వ భూములపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.మానవతా దృక్పథంతో అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులందరికీ పరిహారం, మిగితా బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

నోటిఫైడ్ కానీ వారి దరఖాస్తులపై మరోసారి అధికారులతో సర్వే చేయిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఎస్డీసీ రాధాబాయ్, డీఆర్డీఓ శేషాద్రి, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube