అనుమతులు లేకుండా డీజేలు నడిపిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు రెండు డి.జే లు సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా శుక్రవారం రోజున సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకంపేట,సిరిసిల్ల పాత బస్టాండ్ రాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా రోడ్లపై డీజేలను పెట్టుకొని ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తూన్నా రెండు డీజే ల యజమానులైన 1.పేర్ల పవన్ కుమార్, 2.గోలి రాజేందర్ అను వారిపై వేరు వేరుగా కేసులు నమోదు చేసి వాహనాలతో యుక్తంగా డీజే లను సీజ్ చేయడం జరిగిందని డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

 Case Has Been Registered Against Two Djs Operating Without Permits, Case Registe-TeluguStop.com

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు నిర్వహించిన,యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ, శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డి.జే యజమానులతో పాటుగా నిర్వహకులపై కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

గణేష్ మండపాల వద్ద పోలీస్ అధికారుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అదికూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అని.అధిక శబ్దాలు చేసే డి.జే ల వలన చిన్న పిల్లలు, విద్యార్థుల చదువుకు, వృద్ధులు ఆరోగ్యనికి ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో జిల్లాలో రోజు డి.జే నిర్వహకులపై డయల్100 కాల్స్ వస్తున్నాయని జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదు అని స్పష్టం చేశారు.

ఇప్పటికే జిల్లాలో డి.జే యజమణులకి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందని, ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో డి.జే యజమానులను బైండోవర్ చేయడం జరిగిందన్నారు.కొంత మంది డి.జే యజమానులు పోలీస్ వారి సూచనలు బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube