త్వరలో మీ సేవలో 9 రెవిన్యూ సేవలు?

హైదరాబాద్:ఆగస్టు 31 తెలంగాణలోని మీ సేవ కేంద్రాలు పౌరులకు పలు రకాలైన ప్రభుత్వ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా.

 9 Revenue Services Coming Soon?-TeluguStop.com

మీ సేవ కేంద్రాల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసర మైన వివిధ ధ్రువీకరణ పత్రాలను మీ సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని భూ పరిపా లన ప్రధాన కమిషనర్‌ కీలక నిర్ణయించారు.

ప్రస్తుతం ఎమ్మార్వోలు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ సేవ కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లో పొందేలా చర్యలు చేపట్టారు.కొత్తగా అందుబాటులోకి తీసు కొచ్చిన తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ ఆన్‌ బోర్డ్‌’లో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు.

పౌరుల పేరు మార్పిడి, తరచూ జారీ చేసే ఆదాయం, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్‌ క్యాండిడేట్‌, విద్యార్థులకు అవసరమైన స్టడీ గ్యాప్‌ సర్టిఫికెట్‌, క్రీమీలేయర్, నాన్‌ క్రీమీలేయర్‌, మార్కెట్‌ విలువ, మైనారిటీ ధ్రువీకరణ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్‌-1(బి) సర్టిఫైడ్‌ కాపీలు సైతం మీ సేవ కేంద్రాల నుంచి జారీ చేయనున్నారు.ఇక రేవంత్ సర్కార్ త్వరలో భూ దస్త్రాలు, యాజమా న్య హక్కుల ఆర్వోఆర్‌- 2024,చట్టాన్ని తీసుకొచ్చేం దుకు సిద్ధమమైంది.

ఈ చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి.ప్రధానంగా ఎమ్మార్వో స్థాయిలోనే అధికారాలు ఉండాలని ఎక్కువ మంది ప్రజల నుంచి విజ్ఞాపనలు వచ్చినట్లు సమాచారం.

ఈ మేరకు జులై 2 నుంచి 23వ తేదీ వరకు ఆర్వో ఆర్‌-2024 చట్టానికి సంబంధించిన ముసా యిదాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంత రాలను స్వీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube