ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్( West Midlands in England ) ప్రాంతంలోని తమ ఇంట్లో శవమై కనిపించిన 10 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించింది.ఆమెను జస్కిరత్ కౌర్( Jaskirat Kaur ) అలియాస్ జాస్మిన్ కాంగ్‌గా గుర్తించారు.
ఈమె తన బిడ్డ షే కాంగ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అభియోగాలు మోపారు.వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు ఆ బాలిక రౌలీ రెగిస్లో గాయాలతో సంఘటనా స్థలంలోనే మరణించినట్లు వెల్లడించారు.
వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టు ( Wolverhampton Crown Court )నుంచి వీడియో లింక్ ద్వారా ఆమె విచారణకు హాజరైంది.అక్టోబర్ 25న జస్కిరత్ కౌర్‌కు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేయనున్నారు.
మీ కేసును శిక్ష కోసం వాయిదా వేస్తున్నామని, అక్టోబర్ 25 నాటికి కొన్ని నివేదికలు అవసరమవుతాయని న్యాయమూర్తి తెలిపారు.ఆ నివేదికల తయారీకి సహకరించాలని ఆయన కౌర్‌కి సూచించారు.
అంతకుముందు ఆమె ఛాతీపై కత్తిపోటు కారణంగా షే కాంగ్ ( Shay Kong )మరణించిందని ష్రాప్షైర్ స్టార్ నివేదించింది.ఆమె మరణం పట్ల బ్రిక్‌హౌస్ ప్రైమరీ స్కూల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.బొమ్మలు, కార్డ్‌లు, బెలూన్లతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఆమెకు నివాళులర్పించారు.అదే పాఠశాలలో చదువుకుంటున్న కొంతమంది పిల్లల తల్లిదండ్రులు షే అంత్యక్రియల కోసం డబ్బును సేకరించడానికి గో ఫండ్ మీ పేజీని ప్రారంభించారు.
వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు జస్కీరత్ కౌర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత విచారణ కోసం మరే వ్యక్తి కోసం గాలించడం లేదని తెలిపారు.షే కాంగ్ మరణం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వెస్ట్ మిడ్లాండ్స్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డాన్ జారట్ ఆవేదన వ్యక్తం చేశారు.డిఫెన్స్ న్యాయవాది కేథరీన్ గొడ్డార్డ్ ( Catherine Goddard )మాట్లాడుతూ.ఈ కేసు వాస్తవాలపై ఎలాంటి వివాదం లేదన్నారు.క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సైతం ఈ నేరం ప్రాసిక్యూషన్‌కు ఆమోదయోగ్యమైనదని ధృవీకరించింది.