ఈ సింపుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!

సాధారణంగా కొందరి దంతాలు తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉంటాయి.ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ లేకపోవడం, కాఫీ టీ కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు అధికంగా తీసుకోవడం, స్మోకింగ్, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి.

 Say Goodbye To Yellow Teeth With This Simple Remedy! Simple Remedy, Home Remedy,-TeluguStop.com

అటువంటి దంతాలతో మీరు బాధపడుతున్నారా.? దంతాలను తెల్లగా ముత్యాల మాదిరి మెరిపించుకోవాలని భావిస్తున్నారా.? అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీ తో సులభంగా పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడిని( Clove powder ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము( Grate ginger ) లేదా అల్లం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy Teeth, Remedy, Latest, Oral, Goodbyeyellow, Teeth, Teeth Re

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై గోరువెచ్చని వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు క్రమంగా మాయమవుతాయి.దంతాలు తెల్లగా మారతాయి.

Telugu Tips, Healthy Teeth, Remedy, Latest, Oral, Goodbyeyellow, Teeth, Teeth Re

అలాగే లవంగాలు అల్లం లో ఉండే పలు సుగుణాలు చిగుళ్ళ ఆరోగ్యానికి అండగా ఉంటాయి.చిగుళ్ళ వాపు( Inflammation of the gums ), చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు దూరం అవుతాయి.దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా మరియు దృఢంగా మారతాయి.కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు, ముత్యాల్లాంటి మెరిసే దంతాలను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube