ఇటీవల కాలంలో ఒక సినిమాను రెండు మూడు పార్ట్‌లుగా తెరక్కించడం అన్నది బాగా ట్రెండ్ అయిపోయింది.ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలు ఈ విధంగానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు త్వరలోనే గతంలో విడుదల అయిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా మాత్రమే తెరకెక్కుతుందని అందరూ భావించారు.
కానీ ఇటీవల ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని, పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో రూపొందిన చిత్రం పుష్ప: ది రైజ్.మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో సత్తాను చాటింది.ప్రపంచ వ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ప్రస్తుతం పుష్పకి రెండో భాగంగా పుష్ప: ది రూల్ తెరకెక్కుతోంది.ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే పుష్ప-2 నుంచి విడుదలైన గ్లింప్స్ కి, టీజర్ కి భారీగా రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనాలు సృష్టించడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు.ఇదిలా ఉంటే, పుష్ప చిత్రానికి మూడో భాగం కూడా ఉందట.

ఇప్పటికే మూడో భాగానికి పుష్ప: ది రోర్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.అయితే ఈ మూడో భాగం పుష్ప-2.విడుదలైన వెంటనే ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో ఒక సినిమా కమిటై ఉన్నాడు.
మరోవైపు సుకుమార్ కూడా తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది.మరి బన్నీ, సుకుమార్ లు ముందు పుష్ప-3 పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్స్ పైకి వెళ్తారా? లేక ముందుగా వేరే ప్రాజెక్ట్స్ చేసి, కాస్త గ్యాప్ తర్వాత పుష్ప-3 చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఒకవేళ అలాగే కంటిన్యూ చేస్తే కనుక త్రివిక్రమ్ బన్నీ డేట్స్ కోసం ఎదురు చూడక తప్పదు.రామ్ చరణ్ కు కూడా సుకుమార్ కోసం ఎదురు చూడక తప్పదు.
ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.