ప్రతిరోజు సోషల్ మీడియా( Social media )లో అనేక సంఘటనలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.తాజాగా నోయిడా( Noida )లోని సెక్టార్ 72లోని బి బ్లాక్లో కారు పార్కింగ్ విషయంలో రెండు వ్యక్తుల గ్రూపుల మధ్య వివాదం జరిగింది.
అనంతరం నడిరోడ్డుపై కర్రలు ఉపయోగించి వాహనాలను ధ్వంసం చేశారు.వృద్ధ మహిళల పట్ల గౌరవం లేకుండా ఎంత అహంకారానికి పాల్పడ్డారో దాడి తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో కొట్లాటలు, కారు దెబ్బతినడం కనిపిస్తుంది.వైరల్ వీడియోను గుర్తించిన కొత్వాలి సెక్టార్ 113 పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ కి పిలిపించి విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కారు పార్కింగ్ విషయంలో సెక్టార్ 72లో నివాసం ఉంటున్న రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది.నితిన్ తరపు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్ ను కొట్టారు.
దీని తర్వాత, గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు నితిన్ కారును కర్రలతో, క్రికెట్ బ్యాట్ తో కారును పూర్తిగా ధ్వంసం చేశారు.
ఈ వీడియోలో, ఇరువర్గాల వ్యక్తులు ఒకరినొకరు దూషించుకోవడం.అలాగే కొట్టుకోవడం కనిపిస్తుంది.ఒక వైపు నుండి అబ్బాయిలు కారు అద్దాలు, లైట్లు పూర్తిగా పగలగొట్టడం కనిపిస్తుంది.
ఈ కేసులో ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించిన తర్వాత ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని ఏసీపీ శైవ్య గోయల్ తెలిపారు.వైరల్ వీడియోల ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు.