తెలంగాణ డప్పుకు ఆంధ్రా పురస్కారం...!

సూర్యాపేట జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్టు 22న విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రం వేదికగా ఉత్తరాంధ్ర జానపద జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మహిళా డప్పు బృందం విన్యాసం మరియు ఒగ్గు డోల్ విన్యాసాల ప్రత్యేక ప్రదర్శనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నాయి.

 Janapada Samrat Award For Telangana Drum Artist, Janapada Samrat Award ,telangan-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, చలనచిత్ర హాస్య నటుడు బ్రహ్మానందం,రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తదితరులు హాజరయ్యారు.

ప్రదర్శన అనంతరం నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన యువ డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ డప్పు కళకు అందిస్తున్న సేవలకు గాను “జానపద సామ్రాట్” గౌరవ పురస్కారాన్ని రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి చేతుల మీదుగా సత్కరించారు.ఈ యొక్క అవార్డు రావడానికి కృషి చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సతీష్ మహిళా డప్పు కళా బృందం సభ్యులు అపర్ణ, గంగ,రమణ,సంధ్య,మార్తా,జ్యోతి,అనిత,వీరబాబు, శోభన్,కల్పనా,స్వరూప, నాగమణి,రేణుక,రాణి,రజిత,ధనమ్మ,గ్రామస్తులు సతీష్ మాస్టర్ కి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube