రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు: పవన్ కళ్యాణ్

సినీ నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక చిరంజీవి(Chiranjeevi ) స్టార్ హీరో అయిన తర్వాత రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

 Chiranjeevi Rudraveena Move Made Power Ful Impact On Pawan Kalyan , Rudraveena-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ సైతం తన అన్నయ్య బాటలోనే రాజకీయాలలోకి వెళ్లారు.చిరంజీవి రాజకీయాలలో సక్సెస్ అందుకో లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా( Deputy CM ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అలాగే ఈయన పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ మంత్రిగా తీసుకున్న శాఖలలో పంచాయతీరాజ్ శాఖ కూడా ఒకటి.

Telugu Chiranjeevi, Deputy Cm, Pawan Kalyan, Rudraveena, Tollywood-Movie

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కచ్చితంగా ఈయన హోమ్ మినిస్టర్ ( Home Minister ) గా బాధ్యతలు తీసుకుంటారని అందరూ భావించారు.అయితే అందరి ఊహకు విభిన్నంగా ఈయన హోం శాఖ కాకుండా పర్యావరణ, అటవీ, పంచాయితీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు అయితే తాజాగా ఈయన తాను ఎందుకు పంచాయతీరాజ్ తీసుకున్నాను హోంశాఖ ఎందుకు తీసుకోలేదు అనే విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు.

Telugu Chiranjeevi, Deputy Cm, Pawan Kalyan, Rudraveena, Tollywood-Movie

తన అన్నయ్య చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా ( Rudra Veena ) తనని ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు.ఈ సినిమాలో కష్టాలలో ఉన్న ఒక గ్రామాన్ని ఒక సర్పంచ్ తలుచుకుంటే ఆ గ్రామానికి ఎలాంటి కష్టాలు లేకుండా చేయడమే కాకుండా దేశం మొత్తం ఆ సర్పంచ్ వైపు చూసేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు.ఈ సినిమా నన్ను ప్రభావితం చేయడంతోనే తాను కూడా గ్రామాలను అభివృద్ధి చేస్తే దేశం ముందుకు వెళుతుందని భావించి హోంశాఖ కాకుండా పంచాయతీ శాఖను తీసుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube