పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannadh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన ఇప్పటివరకు వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే.

 Time To Puri Leaves From Movies Details, Puri Jagannath, Tollywood, Puri Jaganna-TeluguStop.com

మొదట పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించగా మధ్యలో కొన్ని కొన్ని సినిమాల్లో ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే చివరగా ఇటీవలే డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు పూరి జగన్నాథ్.

Telugu Puri Jagannadh, Double Ismart, Ismart Shankar, Liger, Mani Sharma, Purija

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త పూరీ జగన్నాథ్ అభిమానులను కలవరపెడుతోంది.అదేమిటంటే.

పూరి జగన్నాథ్ సినిమా కెరియర్ ముగిసిందని, సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.ఏంటి నిజమా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సినిమాల ఫలితాలు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అని నమ్మక మానదు.ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయినా పూరి జగన్నాథ్ లైగర్( Liger ) డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ భావించారు.

కానీ ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి.

Telugu Puri Jagannadh, Double Ismart, Ismart Shankar, Liger, Mani Sharma, Purija

ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) ముందు అన్నీ ఫ్లాపులే.దాదాపు ఇన్నింగ్స్ ముగిసిపోయింది అనుకున్నారు.రామ్ ఎనర్ఙీ డ్యాన్స్ లు, మంచి కిక్ ఇచ్చే పాటలు, పక్కా స్కోరీ ఇవన్నీ కలిసి వచ్చాయి.

దాంతో ఇస్మార్ట్ పెద్ద హిట్ అయింది.కానీ లైగర్, డబుల్ ఇస్మార్ట్ మళ్లీ తన్నేసాయి.

డబుల్ ఇస్మార్ట్ పాటలు ఇంత సూపర్ అంత సూపర్ అనుకోవడమే తప్ప నిజానికి ఇస్మార్ట్ శంకర్ తో పోల్చుకుంటే నథింగ్ అనుకోవాల్సిందే.సరైన హీరోయిన్ పాత్ర లేదు.

హీరోయిన్ సెట్ కాలేదు.నిజానికి మణిశర్మ కూడా ఇస్మార్ట్ శంకర్ కు ముందు అల్మోస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినట్లే.

ఇస్మార్ట్ సినిమాతో మణిశర్మ చకచకా సెకెండ్ ఇన్నింగ్స్ బోలెడు సినిమాలు చేసారు.

కానీ మ్యూజికల్ హిట్ అని చెప్పుకునే సినిమా ఒక్కటి లేదు.

ఒక్కటి, రెండు పాటలు తప్ప మరే పాట చెప్పుకోవడానికి కూడా లేదు.దాంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ కు డేట్ ఇవ్వడానికి చాలామంది హీరోలు వెనుకడుగు వేస్తున్నారు.

ఇప్పటికే దాదాపుగా అందరూ హీరోలతో చేసేసారు.దాంతో పూరి జగన్నాథ్ పరిస్థితిని చూసి ప్రస్తుతం ఏ హీరో అతనికి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఒకవేళ ఇదే కనుక కొనసాగితే పూరి జగన్నాథ్ సినిమా కెరియర్ కి గుడ్ బాయ్ చెప్పడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube