రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు: పవన్ కళ్యాణ్
TeluguStop.com
సినీ నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ తో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక చిరంజీవి(Chiranjeevi ) స్టార్ హీరో అయిన తర్వాత రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ సైతం తన అన్నయ్య బాటలోనే రాజకీయాలలోకి వెళ్లారు.చిరంజీవి రాజకీయాలలో సక్సెస్ అందుకో లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని నేడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా( Deputy CM ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అలాగే ఈయన పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ మంత్రిగా తీసుకున్న శాఖలలో పంచాయతీరాజ్ శాఖ కూడా ఒకటి. """/" /
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కచ్చితంగా ఈయన హోమ్ మినిస్టర్ ( Home Minister ) గా బాధ్యతలు తీసుకుంటారని అందరూ భావించారు.
అయితే అందరి ఊహకు విభిన్నంగా ఈయన హోం శాఖ కాకుండా పర్యావరణ, అటవీ, పంచాయితీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు అయితే తాజాగా ఈయన తాను ఎందుకు పంచాయతీరాజ్ తీసుకున్నాను హోంశాఖ ఎందుకు తీసుకోలేదు అనే విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు.
"""/" /
తన అన్నయ్య చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా ( Rudra Veena ) తనని ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు.
ఈ సినిమాలో కష్టాలలో ఉన్న ఒక గ్రామాన్ని ఒక సర్పంచ్ తలుచుకుంటే ఆ గ్రామానికి ఎలాంటి కష్టాలు లేకుండా చేయడమే కాకుండా దేశం మొత్తం ఆ సర్పంచ్ వైపు చూసేలా ఈ సినిమాని తీర్చిదిద్దారు.
ఈ సినిమా నన్ను ప్రభావితం చేయడంతోనే తాను కూడా గ్రామాలను అభివృద్ధి చేస్తే దేశం ముందుకు వెళుతుందని భావించి హోంశాఖ కాకుండా పంచాయతీ శాఖను తీసుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆటోను కారుగా మార్చేసిన యువకుడు… మెచ్చుకుంటున్న జనాలు!