సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు అనేవి కొద్దిగా గ్యాప్తోనే జరుగుతుంటాయి.కావాలని ఎవరూ ముహూర్తాలు చాలా గ్యాప్ తో పెట్టుకోరు.
కానీ యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంటాయి.అయితే 1984లో మాత్రం కేవలం ఒక్క రోజు గ్యాప్ తో ఇద్దరు అగ్ర నటుల తనయుల పెళ్లిళ్లు జరిగాయి.
ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోలు వరుసగా రెండు రోజుల్లోనే తమ తనయుల పెళ్లిళ్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.వారి పెళ్లిలను చెన్నైలోనే జరిపించారు.
మరి ఆ రెండు పెళ్లిళ్లు ఎవరివో తెలుసుకుందాం.
ఏఎన్నార్ కుమారుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున 1984, ఫిబ్రవరి 18న లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు.లక్ష్మీ ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు( D Ramanaidu )కి కూతురు అవుతుంది.ఆమెకు ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు బ్రదర్స్ అవుతారు.లక్ష్మీ, నాగార్జున ( Nagarjuna, Lakshmi Daggubati )దంపతులకు 1986, నవంబర్ 23న హీరో నాగ చైతన్య పుట్టాడు.
కానీ, కొన్ని కారణాల వల్ల 1990లో వీళ్లు విడాకులు తీసుకున్నారు.అప్పట్లో వీరి విడాకులు సంచలనం అయ్యాయి.అనంతరం నాగార్జున యాక్ట్రెస్ అమలను 1992, జూన్ 11న పెళ్లి చేసుకున్నాడు.ఈ దంపతులకు పుట్టిన కుమారుడే అఖిల్.
అయితే 1984, ఫిబ్రవరి 19న అంటే నాగార్జున పెళ్లి జరిగిన మరొకటి రోజే నటభూషణ శోభన్ బాబు, శాంతకుమారి దంపతుల కుమారుడు కరుణ శేషు( Sobhan Babu Son Karuna Seshu) పెళ్లి జరిగింది.కరుణ శేషు పొట్లూరు వెంగళరావు కుమార్తె విజయను పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరి పెళ్లిళ్లకి పెద్ద సంఖ్యలో సినిమా నటులు హాజరయ్యారు.ఈ రెండు రోజులు చెన్నై నగరం సినిమా నటుల రాకతో చాలా సందడిగా మారింది.శోభన్ బాబుకు మృదుల, ప్రశాంతి, నివేదిత అనే ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.అయితే వారెవరూ సినిమాల్లోకి రాలేదు.
కరుణాశేష్ను కూడా ఎప్పుడూ సినిమా పరిశ్రమకు పరిచయం చేయలేదు.సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడాల్సి ఉంటుందని, మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే ఒక టెన్షన్ కూడా ఉంటుందని శోభన్ బాబు తన కుమారుడిని ఇందులోకి తీసుకురాలేదు.
తాను పడిన ఈ కష్టాలు తన కుమారుడు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు.అతన్ని ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మాన్గా నిలబెట్టారు.
అయితే కరుణ శేషు శోభన్ బాబు లాగానే అందంగా ఉంటాడు.