గత పదేళ్లలో రవితేజ హీరోగా నటించి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు ఇవే!

మాస్ మహారాజ్ రవితేజకు( Ravi Teja ) ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే గత పదేళ్లలో రవితేజ నటించి హిట్టైన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.

 Raviteja Flop Result Movies Details , Ravi Teja, Hero Ravi Teja, Ravi Teja Flop-TeluguStop.com

ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తున్న రవితేజ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంలో పూర్తిస్థాయిలో ఫెయిలవుతున్నారు.ఒకప్పుడు వరుస హిట్లను అందుకున్న రవితేజకు ఇలాంటి పరిస్థితా అని నెటిజన్లు షాకవుతున్నారు.

కిక్2,( Kick 2 ) టచ్ చేసి చూడు,( Touch Chesi Choodu ) నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా, ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్,( Eagle ) మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమాలతో ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నారు.బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

రవితేజ సక్సెస్ రేటు గత పదేళ్లలో కేవలం 35 శాతంగా ఉంది.

Telugu Eagle, Ravi Teja, Khiladi, Kick, Bachchan, Raavanasura, Ramarao Duty, Rav

రవితేజ కథల ఎంపికలో మారకపోతే కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రవితేజ ఇకనైనా నవ్యత ఉన్న కథాంశాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మాస్ మహారాజ్ రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

వింటేజ్ రవితేజ కావాలని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Eagle, Ravi Teja, Khiladi, Kick, Bachchan, Raavanasura, Ramarao Duty, Rav

రవితేజ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.రవితేజ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మాస్ మహారాజ్ రవితేజ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

రవితేజ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో ఒకరు కావడం గమనార్హం.రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube