మలబద్ధకం( Constipation ).వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
అయితే ఈ సమస్య గురించి బయటకు చెప్పుకునేందుకు ఎవరు ఇష్టపడరు.అలా అని మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక రోగాలు ఒంట్లోకి వచ్చి చేరతాయి.
అందుకే కొందరు ఈ సమస్యను వదిలించుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ మందులతో సంబంధం లేకుండా సహజంగా కూడా మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.నిత్యం ఉదయం ఈ డ్రింక్ ను తాగితే ఎలాంటి మలబద్ధకం అయినా పరార్ అవ్వాల్సిందే.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు( Anise seeds ) వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో స్టార్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ సోంపు పొడి,( Anise powder ) అర టీ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము( Grate ginger ) వేసుకుని కనీసం 12 నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
రోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది.మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.సొంపు గింజలు డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం.
ఫైబర్ జీర్ణవ్యవస్థ యొక్క సరైన పనితీరుకు ముఖ్యమైనది.ఫైబర్ మలాన్ని సాఫీగా నెట్టివేస్తుంది.
మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.అలాగే అల్లం కూడా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెట్టగలదు.
కాబట్టి మలబద్ధకం సమస్యతో వర్రీ అవ్వడం మానేసి సొంపు, అల్లంతో పైన చెప్పిన విధంగా సూపర్ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.