సోషల్ మీడియాలో హస్బెండ్ వైఫ్ వీడియోలు( Husband Wife Videos ) బాగా వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా భార్యాభర్తల ఫన్నీ వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భార్య చూపించిన తెలివికి భర్త బలయ్యాడు.
ఈ వీడియో చూసి చాలామంది తెగ నవ్వుకుంటున్నారు.ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది ఇందులో ఒక భార్య తన భర్త చేత ఆయన గర్ల్‌ఫ్రెండ్స్ పేర్లు చెప్పించింది.
సాధారణంగా భర్తలు తమకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరని చెబుతారు.కానీ ఈ భార్య ఒక తెలివైన ట్రిక్ ఉపయోగించి భర్త చేత మాజీ ప్రియురాలి పేర్లు చెప్పించింది.
ఈ వీడియోలో భార్య తన భర్తతో ఒక గేమ్( husband ) మొదలుపెడుతుంది.అది ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు బెస్ట్ ఫ్రెండ్స్‌లా భావించాలి.ఫ్రెండ్స్ అయితే ఒకరికొకరు ఏదైనా చెప్పకోవచ్చు కదా అని అడుగుతుంది.ఆ తర్వాత తనని కాకుండా ఎవరైనా ఇతర అమ్మాయిలను ఇష్టపడుతున్నావా? అని అడుగుతుంది.అప్పుడు ఆయన కొంచెం సంకోచంగా తనకి ఆమె ఒక్కరే ఇష్టమని చెప్తాడు.కానీ భార్య మాత్రం తనకి తన భర్తతో పాటు మరో ముగ్గురు ఇష్టమని చెప్తుంది.
అప్పుడు భర్త కూడా తనకి ఇంకొకరిద్దరు ఇష్టమని ధైర్యంగా చెప్తాడు.ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమకి ఇష్టమైన వాళ్ల పేర్లు కాగితాల మీద రాసి పెడతారు.
తర్వాత భార్య రాసిన కాగితాన్ని చూసి భర్త షాక్ అవుతాడు.ఎందుకంటే భార్య భర్త పేరుని మూడు రకాలుగా రాస్తుంది.ఉదాహరణకి నా భర్త, నా తమ్ముడి బావ, మా తల్లిదండ్రుల అల్లుడు అని రాస్తుంది.కానీ అమాయకమైన భర్త మాత్రం తనకు ఇష్టమైన అమ్మాయిల పేర్లు రాసి అడ్డంగా దొరికిపోతాడు.
భార్య ఈ విధంగా తెలివిగా ఆడిన గేమ్ చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.భార్య తన భర్త రాసిన కాగితం చూసినప్పుడు, తన కుటుంబంలోని ముగ్గురు అమ్మాయిల పేర్లు కనిపిస్తాయి.
వారందరినీ ఇష్టపడుతున్నట్లు వారి పేర్లు రాసి ఉంచాడు.ఆ తర్వాత భార్య తన భర్తపై కోపం వ్యక్తం చేస్తుంది.
ఆ ముగ్గురు అమ్మాయిల చేత నీకు రాఖీ కట్టిస్తా అని చెప్పింది.@feelmuneeb ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి, అందరూ ఆ భార్యని ఎంత తెలివైనదో అని ప్రశంసించారు.
చాలామంది భార్య ఆ భర్తను బాగా మోసం చేసిందని, కానీ చాలా ఫన్నీగా చేసిందని కామెంట్ చేశారు.