ప్రభాస్ హను రాఘవపూడి కాంబో సినిమాలో హీరోయిన్ ఈమే.. ఈ లక్కీ బ్యూటీ ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న హీరోలలో ప్రభాస్( Prabhas ) ఒకరు కాగా సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయి.ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ప్రభాస్ రెమ్యూనరేషన్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

 Prabhas Hanu Raghavapudi Combo Movie Heroine Updates Details, Prabhas, Hanu Ragh-TeluguStop.com

ప్రభాస్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబో మూవీ తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

ఈ సినిమాకు ఫౌజీ( Fauji ) అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినా మేకర్స్ మాత్రం ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు.మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట మృణాళ్ ఠాకూర్ పేరు వినిపించగా ఆమె ఈ సినిమాలో నటించడం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

అయితే ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ కు ఛాన్స్ దక్కడం కొసమెరుపు.

Telugu Fauji, Iman Esmail, Prabhas, Prabhas Fauji, Prabhashanu, Prabhasiman-Movi

ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న హీరోయిన్ పేరు ఇమాన్ ఇస్మాయిల్( Iman Esmail ) కాగా ఆమెకు సంబంధించిన విశేషాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ యువతి ఢిల్లీకి చెందిన యువతి కాగా ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఆమె పాపులర్ అని సమాచారం అందుతోంది.ప్రభాస్ కు జోడీగా నటిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు మారు మ్రోగుతోంది.

డాన్స్ వీడియోల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలుస్తోంది.ప్రభాస్ మూవీ కోసం ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్ తో నటించిన సినిమా హిట్టయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Fauji, Iman Esmail, Prabhas, Prabhas Fauji, Prabhashanu, Prabhasiman-Movi

అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మరో హీరోయిన్ నటిస్తారా? లేక ఇమాన్ ఇస్మాయిల్ మాత్రమే హీరోయిన్గా ఉంటారా అనే ప్రశ్నకు మేకర్స్ నుంచి జవాబు దొరకాల్సి ఉంది.2026 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube