ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీకి టీడీపీ దూరమేనా ? ఎటు తేల్చుకోలేకపోతున్నారా ? 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార టిడిపి( TDP ) కూటమి ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతోంది.ఇక్కడ సరిపడినంత బలం లేకపోవడంతో , పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఇంకా తర్జనభజన పడుతోంది .

 Can't Decide Whether Tdp Is Far From Contesting Mlc Elections, Tdp, Visakha Mlc-TeluguStop.com

ఇప్పటికే వైసిపి తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటిషన్,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) ను ప్రకటించింది.స్థానిక సంస్థల ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఉండడంతో,  ఆ పార్టీ విజయానికి డొఖా లేదు.

కాకపోతే ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే వైసిపి కి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు తమకు మద్దతుగా నిలబడితే , ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని ఒకవైపు టిడిపి కూటమి భావిస్తున్నా.వైసిపికి( YCP ) సరిపడనంత బలం ఉండడంతో పోటీకి దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయం కొంతమంది నేతల్లో కనిపిస్తోంది.

Telugu Ap, Tdp Mlc, Chandrababu, Janasena, Visakha Mlc, Ysrcp-Politics

దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని కొందరు , పోటీకి దూరంగా ఉంటే మంచిదని మరికొంతమంది చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు.గెలుస్తమనే నమ్మకంతో ఓటర్ల మద్దతు కూడగడితేనే పోటీ చేద్దామని చంద్రబాబు వారికి సూచించారట.దీంతో పోటీ చేద్దామని ప్రతిపాదించిన నాయకులు ఓటర్ల మద్దతు విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  చంద్రబాబు( Chandrababu ) కూడా ఈ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించలేదు.నామినేషన్ దాఖలకు మంగళవారం తుది గడువు కావడంతో వైసిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

టిడిపి పోటీ చేయకపోతే ఎన్నికల్లో ఆయనే తప్పకుండా గెలుస్తారు.

Telugu Ap, Tdp Mlc, Chandrababu, Janasena, Visakha Mlc, Ysrcp-Politics

ఒకవేళ టిడిపి తగినంత బలం లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగినా ఖర్చు భారీగానే ఉంటుంది.విజయవకాశాలు అంతంత మాత్రమే.అందుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబు కూడా వచ్చేసారట.

దీంతో ఈ విషయంపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు టిడిపి నుంచి పోటీ చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నా.ఈ ఎన్నికల్లో ఓడిపోతే బలం లేకపోయినా పోటీ చేశారన్న పేరు వస్తుందని, టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్న చంద్రబాబు దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube