ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీకి టీడీపీ దూరమేనా ? ఎటు తేల్చుకోలేకపోతున్నారా ? 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార టిడిపి( TDP ) కూటమి ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతోంది.

ఇక్కడ సరిపడినంత బలం లేకపోవడంతో , పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఇంకా తర్జనభజన పడుతోంది .

ఇప్పటికే వైసిపి తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటిషన్,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) ను ప్రకటించింది.

స్థానిక సంస్థల ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఉండడంతో,  ఆ పార్టీ విజయానికి డొఖా లేదు.

కాకపోతే ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే వైసిపి కి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు తమకు మద్దతుగా నిలబడితే , ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని ఒకవైపు టిడిపి కూటమి భావిస్తున్నా.

వైసిపికి( YCP ) సరిపడనంత బలం ఉండడంతో పోటీకి దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయం కొంతమంది నేతల్లో కనిపిస్తోంది.

"""/" / దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని కొందరు , పోటీకి దూరంగా ఉంటే మంచిదని మరికొంతమంది చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు.

గెలుస్తమనే నమ్మకంతో ఓటర్ల మద్దతు కూడగడితేనే పోటీ చేద్దామని చంద్రబాబు వారికి సూచించారట.

దీంతో పోటీ చేద్దామని ప్రతిపాదించిన నాయకులు ఓటర్ల మద్దతు విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో,  చంద్రబాబు( Chandrababu ) కూడా ఈ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించలేదు.

నామినేషన్ దాఖలకు మంగళవారం తుది గడువు కావడంతో వైసిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

టిడిపి పోటీ చేయకపోతే ఎన్నికల్లో ఆయనే తప్పకుండా గెలుస్తారు. """/" / ఒకవేళ టిడిపి తగినంత బలం లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగినా ఖర్చు భారీగానే ఉంటుంది.

విజయవకాశాలు అంతంత మాత్రమే.అందుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబు కూడా వచ్చేసారట.

దీంతో ఈ విషయంపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు టిడిపి నుంచి పోటీ చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నా.

ఈ ఎన్నికల్లో ఓడిపోతే బలం లేకపోయినా పోటీ చేశారన్న పేరు వస్తుందని, టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్న చంద్రబాబు దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

అబ్బాయిలు పల్చటి జుట్టుతో ఇక నో వర్రీ.. ఈ క్రీమ్ మీ కోసమే!