మరి ఇంత కామాంధులేంట్రా మీరు.. లేడీస్ వాష్‌రూమ్‌ డస్ట్‌బిన్‌లో మొబైల్ లో వీడియో రికార్డ్..

ఈమధ్య చాలామంది కామాంధులు మరి బరితెగిస్తున్న సంఘటనలు ప్రతిరోజు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు నగరంలో( Bengaluru ) ఓ పాపులర్ కాఫీ షాపులో( Coffee Shop ) మహిళలకు ఊహించని పరిణామం ఎదురైంది.

 Woman Found Hidden Camera In Coffee Shop Toilet Bin In Bengaluru Details, Viral-TeluguStop.com

ఆవిడ వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డస్ట్ బిన్ లో( Dust Bin ) ఓ మొబైల్ కనిపించింది.ఫ్లైట్ మూడులో పెట్టి ఉన్న ఆ ఫోన్ వీడియో రికార్డు చేయడం జరుగుతోంది.

అయితే అప్పటికే ఆ ఫోను రెండు గంటల పాటు వీడియోని రికార్డు చేసినట్లు మహిళ గుర్తించింది.నగరంలోని బీఈఎల్ రోడ్డులో ఉన్న థర్డ్ వేవ్ కాఫీ( Third Wave Coffee ) అవుట్లైట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇక ఈ సంఘటనకు గురైన ఆ మహిళ తన బాధను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Telugu Bangalore, Bengaluru, Coffee Shop, Hidden Camera, Hidden, Mode, Toilet Bi

ఈ ఘటనకు గురైన ఓ మహిళ గురించి ఓ వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అక్కడ జరిగిన ఘటనను వెల్లడించాడు.ఇందులో భాగంగా.బెంగళూరు నగరంలోని థర్డ్ వేవ్ అవుట్ లెట్ లో ఉన్నానని.ఆ సమయంలోనే ఓ మహిళకు విచిత్రమైన సంఘటన ఎదురైందని చెప్పుకొచ్చాడు.ఓ మహిళ వాష్ రూమ్ లోకి వెళ్ళగా.అక్కడ డస్ట్ బిన్ లో మొబైల్ని కనిపెట్టిందని.

ఫోన్( Phone ) ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచి పెట్టారని., దాదాపు రెండు గంటలపాటు వీడియో రికార్డు చేసినట్లు అతడు తెలిపాడు.

Telugu Bangalore, Bengaluru, Coffee Shop, Hidden Camera, Hidden, Mode, Toilet Bi

అంతేకాకుండా ఆ మొబైల్ ఫ్లైట్ మోడ్ లో ఉంచడం ద్వారా మొబైల్ ఉన్నట్లు ఎవరికీ అర్థం కావట్లేదని కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బెనికి వారు రంద్రం పెట్టి అమర్చినట్లు అతడు చెప్పుకొచ్చాడు.ఓ మహిళ ఈ తరంగాన్ని మొత్తం గుర్తించి సిబ్బందికి చెప్పగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఈ పని చేసినట్టు తేలిందని చెప్పారు.వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వ్యక్తి తెలిపాడు.ఇక ఈ పోస్టు చూసిన సోషల్ మీడియా ఫాలోవర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇంతకన్నా మరేమైనా దారుణం ఉంటుందా.? అంటూ కొందరు మండిపడుతుండగా.ఈ మధ్యకాలంలో బయటికి వెళ్లాలంటే భయం వేస్తున్నట్టు మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube