మరి ఇంత కామాంధులేంట్రా మీరు.. లేడీస్ వాష్‌రూమ్ డస్ట్‌బిన్‌లో మొబైల్ లో వీడియో రికార్డ్..
TeluguStop.com
ఈమధ్య చాలామంది కామాంధులు మరి బరితెగిస్తున్న సంఘటనలు ప్రతిరోజు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.
ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు నగరంలో( Bengaluru ) ఓ పాపులర్ కాఫీ షాపులో( Coffee Shop ) మహిళలకు ఊహించని పరిణామం ఎదురైంది.
ఆవిడ వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డస్ట్ బిన్ లో( Dust Bin ) ఓ మొబైల్ కనిపించింది.
ఫ్లైట్ మూడులో పెట్టి ఉన్న ఆ ఫోన్ వీడియో రికార్డు చేయడం జరుగుతోంది.
అయితే అప్పటికే ఆ ఫోను రెండు గంటల పాటు వీడియోని రికార్డు చేసినట్లు మహిళ గుర్తించింది.
నగరంలోని బీఈఎల్ రోడ్డులో ఉన్న థర్డ్ వేవ్ కాఫీ( Third Wave Coffee ) అవుట్లైట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇక ఈ సంఘటనకు గురైన ఆ మహిళ తన బాధను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" /
ఈ ఘటనకు గురైన ఓ మహిళ గురించి ఓ వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అక్కడ జరిగిన ఘటనను వెల్లడించాడు.
ఇందులో భాగంగా.బెంగళూరు నగరంలోని థర్డ్ వేవ్ అవుట్ లెట్ లో ఉన్నానని.
ఆ సమయంలోనే ఓ మహిళకు విచిత్రమైన సంఘటన ఎదురైందని చెప్పుకొచ్చాడు.ఓ మహిళ వాష్ రూమ్ లోకి వెళ్ళగా.
అక్కడ డస్ట్ బిన్ లో మొబైల్ని కనిపెట్టిందని.ఆ ఫోన్( Phone ) ఎవరికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచి పెట్టారని.
, దాదాపు రెండు గంటలపాటు వీడియో రికార్డు చేసినట్లు అతడు తెలిపాడు. """/" /
అంతేకాకుండా ఆ మొబైల్ ఫ్లైట్ మోడ్ లో ఉంచడం ద్వారా మొబైల్ ఉన్నట్లు ఎవరికీ అర్థం కావట్లేదని కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బెనికి వారు రంద్రం పెట్టి అమర్చినట్లు అతడు చెప్పుకొచ్చాడు.
ఓ మహిళ ఈ తరంగాన్ని మొత్తం గుర్తించి సిబ్బందికి చెప్పగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఈ పని చేసినట్టు తేలిందని చెప్పారు.
వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వ్యక్తి తెలిపాడు.
ఇక ఈ పోస్టు చూసిన సోషల్ మీడియా ఫాలోవర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇంతకన్నా మరేమైనా దారుణం ఉంటుందా.
? అంటూ కొందరు మండిపడుతుండగా.ఈ మధ్యకాలంలో బయటికి వెళ్లాలంటే భయం వేస్తున్నట్టు మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
అదిరిపోయే రికార్డు కొట్టాడు భయ్యా.. 38 గంటలు బొమ్మలా నిలబడి ప్రపంచాన్ని షాక్..!