భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో యూరప్‌.

 India Issues Advisory Warning Indians Against Travel To Uk ,india , Keer Starme-TeluguStop.com

హమాస్- ఇజ్రాయెల్ వార్‌తో పశ్చిమాసియా, బంగ్లాదేశ్‌లో అల్లర్లతో దక్షిణాసియా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారత్ ( India )కూడా ఈ లిస్ట్‌లో ఉంది.కొద్దిరోజుల క్రితం ముగ్గురు చిన్నారులను దుండగులు దారుణం పొడిచి చంపడం యూకేలో సంచలనం సృష్టించింది.

ఆ ఘటన కాస్తా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది.శరణార్ధులు, వలసదారులు ఉన్న ప్రాంతాలపై కొందరు దాడులకు తెగబడ్డారు.

దీంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్( Keir Starmer ) ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Telugu Bangladesh, Advisory, India, Israel, Isreal Hamas, Keer, London-Telugu NR

వలస వ్యతిరేక గ్రూపులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో యూకేలో పరిస్ధితులు అదుపుతప్పాయి.పలు నగరాలు, పట్ణణాలకు నెమ్మదిగా విస్తరిస్తుండటంతో యూకేలోని భారతీయుల భద్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ మేరకు లండన్‌( London )లోని భారత హైకమీషన్ అడ్వైజరీ జారీ చేసింది.

యూకేలోని హైకమీషన్ కార్యాలయం పరిస్ధితిని నిశితంగా గమనిస్తోందని, భారతీయ పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను అనుసరించాలని, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

Telugu Bangladesh, Advisory, India, Israel, Isreal Hamas, Keer, London-Telugu NR

మరోవైపు.ఇజ్రాయెల్ – హమాస్( Isreal-Hamas ) యుద్ధంలో ఇరాన్, హెజ్‌బొల్లాలు జోక్యం చేసుకోవడం.దానికి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.అన్నింటికి మించి హమాస్ చీఫ్ హనియాను తమ భూభాగంపై హతమార్చడంతో ఇరాన్ రగిలిపోతోంది.దీంతో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube