కమల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

కమల్ హాసన్,( Kamal Haasan ) తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఇటీవల తెరకెక్కిన సినిమా భారతీయుడు 2.( Bharateeyudu 2 ) 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

 Indian 2 The Indian Who Fixed The Ott Release Date Where Is The Streaming Detail-TeluguStop.com

ఈ సినిమాను తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా సొంతం చేసుకుంది.

గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అభిమానులకు కూడా తీవ్ర నిరాశ ఎదురయింది.

అయితే ఈ సినిమాను డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్( Netflix ) దాదాపుగా 120 కోట్లకు కొనుగోలు చేసింది.తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు 2 వివాదం ముగిసిందని సమాచారం.

ఇక మరోవైపు ఇండియన్ 2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే.

దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం, థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ 2 ను( Indian 2 ) ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ.దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడో ఓటీటీ లోకి రావాలి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube