కెనడాలో అక్కాతమ్ముడు మృతి.. చివరి చూపు కోసం కుటుంబం నిరీక్షణ

పంజాబ్‌లోని లూథియానా జిల్లా మలౌద్ గ్రామం( Malaudh village )లోని ఒక రైతు కుటుంబం శనివారం నాడు కెనడాలో జరిగిన కారు ప్రమాదంలో తమ బిడ్డలను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడంలో సాయం చేయాలని కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

 After Losing Two Kids In Canada, Punjabi Family Seeks Govt Help To Bring Bodies-TeluguStop.com

పాటియాలాలోని సమనా పట్టణానికి చెందిన వీరి స్నేహితురాలు కూడా ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోవడంతో వాహనం బోల్తా పడింది.

డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ముగ్గురు బయటికి దూకి తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని.

మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.బాధితులు న్యూ బ్రున్స్‌విక్ ప్రిన్స్‌లోని మోంక్టన్ సిటీ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Telugu Canada, Harman Kaur, India, Malaudh, Jaishankar-Telugu NRI

రంజిత్ సోమల్, అతని సోదరుడు మన్‌దీప్ సింగ్ పిల్లలు నవజ్యోతి సింగ్ సోమల్ (19), హర్మాన్ కౌర్ సోమల్ (23)( Navjot Singh Somal , Harman Kaur )లు ఈ ప్రమాదంలో మరణించారు.మన్‌దీప్ మరో కుమారుడు రాజ్‌ప్రీత్ సింగ్ సోమల్ కూడా కెనడాలో స్థిరపడ్డారు.హర్మాన్ ఐదేళ్ల క్రితం కెనడాకు వెళ్లగా.నవజోత్ ఈ ఏడాది ఏప్రిల్ 17న అక్కడికి వెళ్లారు.పంజాబ్‌లో వ్యవసాయం లాభదాయకమైన వృత్తి కాదని.అందుకే మెరుగైన భవిష్యత్తు కోసం సోమల్ బ్రదర్స్ తమ పిల్లలను కెనడాకు పంపించారని పేర్కొన్నారు.

Telugu Canada, Harman Kaur, India, Malaudh, Jaishankar-Telugu NRI

కెనడా( Canada )లో స్థిరపడిన రాజ్‌ప్రీత్ .అక్కడి పంజాబీ కమ్యూనిటీ సాయంతో మూడు మృతదేహాలను భారతదేశానికి పంపడానికి నిధులను సేకరిస్తున్నాడు.ఈ ఘటనపై ఫతేఘర్ సాహిబ్ ఎంపీ డాక్టర్ అమర్‌సింగ్ బొపరాయ్ స్పందించి.

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌( S.Jaishankar )తో ఈ సమస్యను ప్రస్తావించారు.పిల్లల మృతదేహాలను భారతదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి కెనడాలోని అధికారులతో సమన్వయం చేస్తానని జైశంకర్ తనకు హామీ ఇచ్చారని బొపరాయ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube