ఈ మధ్యకాలంలో చాలామంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి లేనిపోని తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా కంటెంట్ తో చాలామంది వీడియోలు తీస్తుంటే.
మరికొందరు., మేము ఏది చేస్తే అది కంటెంట్ అన్నట్లుగా వారికి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే చాలామంది వారి ప్రాణాలను సైతం రిస్కులో పెట్టి రీల్స్ చేస్తున్నారు.ఇందులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు.
ఇకపోతే తాజాగా ఓ యువ జంట పొలంలో చేసిన నాగిని డాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో యువ జంట పొలంలో ఉన్న బురద నీటిలో నిలబడి, పడుకొని, వివిధ స్టైల్స్ లో డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు.ఈ వీడియోను వారికి సంబంధించిన వారికి ఎవరో రికార్డ్ చేసి అది కాస్త సోషల్ మీడియాలో( social media ) పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో ట్రేడింగ్ గా మారింది.ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారో పూర్తి వివరాలు తెలియనప్పటికీ.వీడియోలో ఉన్న ఇద్దరు మాత్రం భార్య భర్తలన్న విషయం మాత్రం అర్థమవుతుంది.నాగిని పాటకు లయ తప్పకుండా కరెక్టుగా సరిపోయే విధంగా డాన్స్ స్టెప్పులు వేసి అదరగొట్టారు.ఈ వీడియోలో ఓసారి మహిళ బురదలో పడి మరి డాన్స్ వేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
అంతేకాదు ఆమెను అనుసరిస్తూ ఆమె భర్త కూడా బురదలో పడుకొని డాన్స్ చేయడం కనపడుతుంది.

దీంతో వీరిద్దరి మధ్య మంచి రొమాన్స్( Romance ) కనపడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మనలో చాలామందికి నాగిని డాన్స్ అంటే ఇష్టమే.కాకపోతే కొందరికి ఆ పాట అంతగా నచ్చదు.
ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అని అనుకున్నారేమో ఆ యువ జంట అందుకే బురదలో పొర్లుతూ స్టెప్పులు వేసి వీడియోని రికార్డ్ చేశారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మీరు డాన్స్ దుమ్ము దులిపారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో కాస్త జాగ్రత్తగా వేయండి లేకపోతే నడుము విరిగిపోతుందంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.