తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీనిస్తూ దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు… ఇక ఇప్పుడు ఆయన కొడుకు అయిన మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఆయన ఎవరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడనే విషయాల మీద సరైన స్పష్టత రానప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఒక ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ( Balakrishna )మొదటి సినిమాతోనే తన కొడుకుకి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాలని ఉద్దేశంతోనే చాలా వరకు కథలను వింటూ అందులో ఏ కథని తనకు సినిమాగా ఎంచుకోవాలి అనే ఉద్దేశ్యం తో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి కొంతమంది దర్శకులతో కూడా కథ చర్చలు జరుపుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే అందులో కొంతమంది సీనియర్ దర్శకులు ఉంటే మరి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు.మోక్షజ్ఞ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయం మీద బాలయ్య ఆగస్టు 15 వ తేదీన ఒక క్లారిటీ ఇవ్వాలని చూస్తున్నారట…

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ ఫిజికల్ ఫిట్నెస్ లో గాని, యాక్టింగ్ స్కిల్స్ లో గానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది.ఇక దానికి తగ్గట్టుగానే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో మోక్షజ్ఞ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలని బాలయ్య చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు…మరి మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా రానిస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…
.