తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సాధారణంగా కొందరిలో షుగర్ క్రేవింగ్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి.ప్రతినిత్యం స్వీట్స్ పై ప్రాణం లాగేస్తూ ఉంటుంది.

 What Are The Reasons For Wanting To Eat Sweets Often? Sweets, Sweets Side Effect-TeluguStop.com

దాంతో సమయం సందర్భం లేకుండా పంచదారతో కూడిన చిరుతిళ్లను తింటూనే ఉంటారు.ఫలితంగా జబ్బుల బారిన పడతారు.

మీకు కూడా తరచూ స్వీట్స్ తినాలనిపిస్తుందా.? ఎంత ప్రయత్నించినా షుగర్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక పోతున్నారా.?అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.తరచూ స్వీట్స్( Sweets ) పై మనసు మళ్లడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఒత్తిడి, నిద్రలేమి, అలసట.స్వీట్స్ తినాలనిపించడానికి ప్రధాన కారణాలు.

ఒత్తిడి, నిద్రలేమి, అలసట.ఈ మూడు ఒకదానితో ఒకటి ఇంటర్ లింకై ఉంటాయి.

కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల తీవ్ర అలసటకు గుర‌వుతారు.క్ర‌మంగా అది ఒత్తిడికి దారితీస్తుంది.

కాబట్టి కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.దాంతో అలసట, ఒత్తిడి దరిచేరకుండా ఉంటాయి.

అదే స‌మ‌యంలో షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి.

Telugu Tips, Latest, Sugar, Sweets, Sweets Effects-Telugu Health

అలాగే శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల కూడా తరచూ స్వీట్స్ తినాలనిపించడానికి ఒక కారణం.శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల బద్ధకం పెరుగుతుంది.బద్ధకం ఆహార కోరికలను పెంచుతుంది.

ముఖ్యంగా షుగర్ క్రేవింగ్ ను హైక్ చేస్తుంది.కాబట్టి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి.

అందుకోసం నిత్యం వ్యాయామం చేయండి.

Telugu Tips, Latest, Sugar, Sweets, Sweets Effects-Telugu Health

తరచూ స్వీట్స్ పై మనసు మళ్లడానికి డీహైడ్రేషన్( Dehydration ) కూడా ఒక కారణం.శరీరంలో నీటి శాతం సరిగ్గా లేనప్పుడు చక్కెర పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది.అలా అనిపించినప్పుడల్లా స్వీట్స్ తిన్నారో మీ ఆరోగ్యం పై ఆశలు వదులుకోవాల్సిందే.

స్వీట్స్ అతిగా తిన‌డం వ‌ల్ల‌ మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె పోటుతో స‌హా అనేక జ‌బ్బుల‌తు త‌లెత్తుతాయి.అలాగే స్వీట్స్ మెదడు మొద్దుబారేలా చేస్తాయి.మెదడు చురుకుదనాన్ని తగ్గిస్తాయి.జ్ఞాపక శక్తిని హరిస్తాయి.

కాబట్టి స్వీట్స్ ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది.అంత‌గా స్వీట్స్ తినాల‌నిపిస్తే.

ఖ‌ర్జూరాలు, అంజీర్, కిస్‌మిస్‌, ఇత‌ర డ్రై ఫ్రూట్స్‌, స్వీట్ కార్న్‌, తాజా పండ్లు, ఉడికించిన చిల‌క‌డ‌దుంప‌లు వంటి ఆహారాలు తీసుకోండి.ఇవి మీ చ‌క్కెర కోరిక‌ల‌ను చ‌క్క‌గా తీరుస్తాయి.

పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube