తన అన్న వైసీపీ అధినేత జగన్( jagan ) కారణంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) పదవికి గండం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు నుంచి రాజకీయంగాను, వ్యక్తిగతంగాను జగన్ ను టార్గెట్ చేసుకుని షర్మిల అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా తమ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ( MP YS Avinash Reddy )కి మద్దతుగా జగన్ ఉండడం , మొన్నటి ఎన్నికల్లో మళ్లీ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం తదితర వ్యవహారాలపై షర్మిల అనేక సందర్భాల్లో స్పందించి విమర్శలు చేశారు.ఏపీలో టీడీపీ, జనసేన బిజెపి కూటమి అధికారంలోకి వచ్చినా, మళ్లీ తనని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండడం జగన్ కు తలనొప్పిగా మారింది.
ఇక ఇటీవల కాలంలో వైసీపీని టార్గెట్ చేసుకుంటూ టిడిపి( TDP ) కూటమి ప్రభుత్వం అనేక చర్యలకు దిగడం, వైసిపి కార్యకర్తలే టార్గెట్ గా టిడిపి శ్రేణులు దాడులకు దిగడం తదితర పరిణామాలపై జగన్ ఘాటుగా స్పందించడంతో పాటు, ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. వివిధ పార్టీల నేతలు చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.రాజకీయంగా తాను నిర్వహించిన ధర్నాకు మద్దతు లభించడం వంటి పరిణామాలతో జగన్ కూడా ఉత్సాహంగా ఉన్నారు.
ఇటీవల ధర్నా కార్యక్రమానికి ఇండియా కూటమిలో కాంగ్రెస్( Congress ) మినహా ఇతర పక్షాలు హాజరై మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా జగన్ ను ఇండియా కూటమి లో చేరాల్సిందిగా కొంతమంది నేతలు ఆహ్వానించారు.
అయితే గతంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ప్రస్తుతం రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం , కేంద్రంలోని బిజెపికి తాము అన్ని విషయాలలోను మద్దతుగా నిలుస్తున్నా .తమను టార్గెట్ చేసుకుంటున్న టిడిపిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం వంటి వ్యవహారాలపై జగన్ కూడా బిజెపి( BJP ) పెద్దల వైఖరి పై ఆగ్రహంగానే ఉన్నారు. రాజ్యసభలో జగన్ కు 11 మంది ఎంపీలు, లోక్ సభకు సంబంధించి నలుగురు ఎంపీలు ఉన్నారు.
రాజ్యసభలోనూ ఎన్డీఏ కూటమికి వైసీపీ ఎంపీల మద్దతు చాలా అవసరం.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జగన్ ను ఇండియా కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందిస్తారని అంచనా వేస్తోంది.అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కారణంగా జగన్ వెనకడుగు వేసే అవకాశం ఉందన్న ఆలోచనతో షర్మిల దూకుడుకు బ్రేక్ వేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుని జగన్ కు పరోక్షంగా మేలు కలిగేలా చేసి, రానున్న రోజుల్లో జగన్ తామ కూటమిలో చేరే విధంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.