టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య( Acharya ).విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అంతే కాకుండా ప్రీ రిలీజ్ టైమ్‌లో కూడా చాలా హైప్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు పాటలు దుమ్మురేపిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే చెర్రీ ఖాతాలో పడుతున్న సినిమా అనుకున్నారు.కట్ చేస్తే థియేటర్లలో జనాల్లేరు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో కంటెంట్ వీక్ అయితే ఏం చేస్తామంటూ పెదవి విరిచేశారు.
అయితే ఆచార్య సినిమాతో పోలిస్తే భోళా శంకర్ సినిమా( Bhola Shankar movie ) పరిస్థితి మరీ దారుణం అని చెప్పాలి.మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ గా వచ్చింది భోళా శంకర్ కి రెండో రోజే థియేటర్లు ఖాళీ అయ్యాయి.కథే కింగ్ అనే విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు ఆడియన్స్.ఇలా చిరు గత రెండు సినిమాలు భారీగా ప్లాప్ అవ్వడంతో ప్రస్తుతం విశ్వంభర విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రతీదాన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు.ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నారు.
విశ్వంభర ( Visvambara )రికార్డులు చూసి జనాలు విస్తుపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు చిరు.అలాగే కమల్ హాసన్ కూడా థగ్ లైఫ్ పై బాగానే ఫోకస్ పెంచారు.కల్కి సినిమాలో యాస్కీన్ వైబ్ నుంచి జనాలు బయటకు రాకముందే థియేటర్లలోకి వచ్చి నిరాశ పరచింది ఇండియన్2( Indian2 ).ఇప్పుడు ఆ నెగటివిటీ మొత్తం తుడుచుపెట్టుకుని పోవాలంటే థగ్‌లైఫ్ యమాగా ఉండాల్సిందే.ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ స్టార్ హీరోలకు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు క్లిక్ అవ్వాల్సిందే.ఈ సినిమాలో క్లిక్ అయితేనే నెక్స్ట్ ప్రాజెక్ట్ లలో జోష్ పెరుగుతుందన్న విషయం ఈ సీనియర్ హీరోలకు బాగా తెలుసు అంటూ కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
మొత్తానికి సీనియర్ హీరోలకు వార్నింగ్ బెల్స్ మొదలయ్యాయి అని చెప్పాలి.