తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్.. నెట్ ఫ్లిక్స్ విచిత్ర ప్రయోగంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై( Director Rajamouli ) నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నిర్మించిన విషయం తెలిసిందే.తాజాగ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

 Audience Fires On Netflix Rajamouli Modern Masters Documentary Telugu Trailer, R-TeluguStop.com

ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి ఇలా చాలా మంది డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడారు.అలాగే అందులో రాజమౌళి కూడా మాట్లాడారు.

ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో వీళ్లంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు.ట్రైలర్ బాగుండటంతో రాజమౌళి డాక్యుమెంటరీ కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తర్వాత రాజమౌళి డాక్యుమెంటరీ( Rajamouli Documentary ) తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేసారు.ఈ ట్రైలర్ లో మన తెలుగు హీరోలు మాట్లాడిన మాటలు కూడా వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు.రాజమౌళికి కూడా ఎవరో డబ్బింగ్ చెప్పారు.అయితే ట్రైలర్ మొత్తం హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ లు చెప్పే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడంతో విమర్శలు వస్తున్నాయి.తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్ అయి ఉండి కూడా వాళ్ళతో తెలుగు మాట్లాడించుకోకుండా వేరే వాళ్ళతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ ( Netflix )విడుదల చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ పై చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫుల్ డాక్యుమెంటరీ మాత్రం తెలుగులో రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా డబ్బింగ్ మాత్రం చెప్పించి నాశనం చేయద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి నెట్ ఫ్లిక్స్ ఏం చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube