పొరపాటున రూ.1.5 కోట్లు శాలరీగా జమ చేసిన కంపెనీ.. అవి తీసుకుని ఉద్యోగి జంప్..??

ఒక్కోసారి కొందరి బ్యాంక్ అకౌంట్స్‌లో అనుకోకుండా చాలా డబ్బు జమ అవుతుంది.మళ్లీ వెంటనే ఆ డబ్బు వెనక్కి తీసుకుంటారు.

 Chilean Man Accidentally Paid 330 Times His Salary Disappears Without A Trace De-TeluguStop.com

కానీ ఒక వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు.ఆ డబ్బు తీసుకుని మాయం అయిపోయాడు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల ఒక చిలి( Chile ) వ్యక్తి తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని స్టన్ అయ్యాడు.ఎందుకంటే, అతని యజమాని అతనికి అతనికి రావాల్సిన జీతం కంటే చాలా ఎక్కువ డబ్బు జమ చేశాడు.ఆ వ్యక్తి సాధారణంగా 500,000 పెసోలు (సుమారు రూ.44,000) జీతం పొందుతాడు.కానీ, ఈసారి అతని ఖాతాలో 165,398,851 పెసోలు (దాదాపు రూ.1.5 కోట్లు) జమ అయ్యాయి! అంటే, అతనికి సాధారణ జీతం కంటే 330 రెట్లు ఎక్కువ డబ్బు జమ చేశారు.

ఇది ఒక పొరపాటు అని గ్రహించాడు ఆ వ్యక్తి.

అతను చిలిలోని అతిపెద్ద సంస్థలలో ఒకటైన ‘ఇండస్ట్రియల్ ఫుడ్ కన్సోర్టియం’ (CIAL)లో పనిచేస్తున్నాడు.ఈ సంస్థ కోల్డ్ కట్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తుంది.2022 మే నెలలో, అతడికి జీతం( Salary ) చెల్లించే సమయంలో ఒక మానవ లోపం కారణంగా అతనికి భారీ జీతం జమ చేయబడింది.

Telugu Salary, Bank, Chile, Chilean, Cial, Employee, Extra, Pay, Error, Nri, Pes

తన ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయినట్లు గమనించిన ఆ వ్యక్తి, తన సీనియర్ సహోద్యోగిని సంప్రదించి నిర్ధారించుకున్నాడు.అసిస్టెంట్ మేనేజర్ కూడా అతనికి ఊహించని విధంగా భారీ జీతం జమ అయినట్లు నిర్ధారించాడు.ఈ విషయం చిలికి చెందిన ‘డైరియో ఫినాన్సియెరో’ అనే వార్తా సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చింది.

Telugu Salary, Bank, Chile, Chilean, Cial, Employee, Extra, Pay, Error, Nri, Pes

భారీ జీతం జమ అయిన విషయం తెలుసుకున్న సంస్థ అధికారులు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆ వ్యక్తికి తెలియజేశారు.తదుపరి రోజు ఉదయం బ్యాంకుకు వెళ్లి డబ్బును తిరిగి చెల్లిస్తానని సదరు ఎంప్లాయి అంగీకరించారు.కానీ, ఆ వ్యక్తి మాట నిలబెట్టుకోలేదు.తదుపరి రోజు ఉదయం అతను పనికి రాలేదు, బ్యాంకుకు( Bank ) కూడా వెళ్లలేదు.అతనిని సంప్రదించడానికి సంస్థ అధికారులు ప్రయత్నించినప్పటికీ, ఫోన్ కాల్స్ ఎవరూ ఎత్తలేదు.

కొన్ని గంటల తర్వాత, చివరకు అతను ఫోన్ చేసి, తాను నిద్రపోతున్నానని, అందుకే పనికి రాలేకపోయానని, బ్యాంకుకు వెళ్లలేకపోయానని చెప్పాడు.

కొన్ని రోజుల తర్వాత, ఆ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు న్యాయవాదుల ద్వారా సంస్థకు తెలియజేసాడు.అప్పటి నుంచి, ఆ ఉద్యోగి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు.

CIAL సంస్థ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది, అతని ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కానీ, ఆ వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.అతనితో పాటు భారీ మొత్తంలో డబ్బు కూడా మాయం అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube