పొరపాటున రూ.1.5 కోట్లు శాలరీగా జమ చేసిన కంపెనీ.. అవి తీసుకుని ఉద్యోగి జంప్..??
TeluguStop.com
ఒక్కోసారి కొందరి బ్యాంక్ అకౌంట్స్‌లో అనుకోకుండా చాలా డబ్బు జమ అవుతుంది.మళ్లీ వెంటనే ఆ డబ్బు వెనక్కి తీసుకుంటారు.
కానీ ఒక వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు.ఆ డబ్బు తీసుకుని మాయం అయిపోయాడు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల ఒక చిలి( Chile ) వ్యక్తి తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని స్టన్ అయ్యాడు.
ఎందుకంటే, అతని యజమాని అతనికి అతనికి రావాల్సిన జీతం కంటే చాలా ఎక్కువ డబ్బు జమ చేశాడు.
ఆ వ్యక్తి సాధారణంగా 500,000 పెసోలు (సుమారు రూ.44,000) జీతం పొందుతాడు.
కానీ, ఈసారి అతని ఖాతాలో 165,398,851 పెసోలు (దాదాపు రూ.1.
5 కోట్లు) జమ అయ్యాయి! అంటే, అతనికి సాధారణ జీతం కంటే 330 రెట్లు ఎక్కువ డబ్బు జమ చేశారు.
ఇది ఒక పొరపాటు అని గ్రహించాడు ఆ వ్యక్తి.అతను చిలిలోని అతిపెద్ద సంస్థలలో ఒకటైన 'ఇండస్ట్రియల్ ఫుడ్ కన్సోర్టియం' (CIAL)లో పనిచేస్తున్నాడు.
ఈ సంస్థ కోల్డ్ కట్స్ ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తుంది.2022 మే నెలలో, అతడికి జీతం( Salary ) చెల్లించే సమయంలో ఒక మానవ లోపం కారణంగా అతనికి భారీ జీతం జమ చేయబడింది.
"""/" /
తన ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయినట్లు గమనించిన ఆ వ్యక్తి, తన సీనియర్ సహోద్యోగిని సంప్రదించి నిర్ధారించుకున్నాడు.
అసిస్టెంట్ మేనేజర్ కూడా అతనికి ఊహించని విధంగా భారీ జీతం జమ అయినట్లు నిర్ధారించాడు.
ఈ విషయం చిలికి చెందిన 'డైరియో ఫినాన్సియెరో' అనే వార్తా సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చింది.
"""/" /
భారీ జీతం జమ అయిన విషయం తెలుసుకున్న సంస్థ అధికారులు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆ వ్యక్తికి తెలియజేశారు.
తదుపరి రోజు ఉదయం బ్యాంకుకు వెళ్లి డబ్బును తిరిగి చెల్లిస్తానని సదరు ఎంప్లాయి అంగీకరించారు.
కానీ, ఆ వ్యక్తి మాట నిలబెట్టుకోలేదు.తదుపరి రోజు ఉదయం అతను పనికి రాలేదు, బ్యాంకుకు( Bank ) కూడా వెళ్లలేదు.
అతనిని సంప్రదించడానికి సంస్థ అధికారులు ప్రయత్నించినప్పటికీ, ఫోన్ కాల్స్ ఎవరూ ఎత్తలేదు.కొన్ని గంటల తర్వాత, చివరకు అతను ఫోన్ చేసి, తాను నిద్రపోతున్నానని, అందుకే పనికి రాలేకపోయానని, బ్యాంకుకు వెళ్లలేకపోయానని చెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత, ఆ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు న్యాయవాదుల ద్వారా సంస్థకు తెలియజేసాడు.
అప్పటి నుంచి, ఆ ఉద్యోగి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు.CIAL సంస్థ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది, అతని ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ, ఆ వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.అతనితో పాటు భారీ మొత్తంలో డబ్బు కూడా మాయం అయింది.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…