శనగలు( Peas ).వీటి గురించి పరిచయాలు అక్కర్లేదు.
నవధాన్యాల్లో శనగలు కూడా ఒకటి.శనగల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి( Iron, Calcium, Magnesium, Vitamin B6, Vitamin C ), ప్రోటీన్, ఫైబర్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందువల్ల పేదవాడి బాదం గా కూడా శనగలు ప్రసిద్ధి చెందాయి.అయితే శనగలు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన లేక చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.
వారానికి రెండుసార్లు ఉడికించిన శనగలు తినడం వల్ల అంతులేని ఆరోగ్య లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఇటీవల రోజుల్లో చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు.
అయితే అలాంటివారు ఉడికించిన శనగలను తమ డైట్ లో చేర్చుకోవాలి.శనగల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల శనగలను తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు.
శనగల్లో ఫైబర్ కంటెంట్ జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం( Constipation ) సమస్యను దూరం చేయడంలో తోడ్పడుతుంది.అలాగే ఉడికించిన శనగలు హృదయనాళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
శనగల్లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది.మరియు కొలెస్ట్రాల్ రహితంగా ఉంటాయి.
కాబట్టి వారానికి రెండు సార్లు ఉడికించిన శనగలను తీసుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
మధుమేహం( diabetes ) బారిన పడకుండా ఉండాలి అనుకుంటున్న వారు తప్పకుండా తమ డైట్ లో శనగలను చేర్చుకోండి.ఎందుకంటే శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో శనగలు సహాయపడతాయి.మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.
అంతేకాదు ఉడికించిన శనగలను వారానికి రెండు సార్లు తింటే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది.శరీర బరువు అదుపులో ఉంటుంది.
జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.శరీరంలో అవయవాల పనితీరుకు అవసరమయ్యే అనేక పోషకాలను సైతం మనం శనగల ద్వారా పొందవచ్చు.