జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ ఫీవర్...గరిడేపల్లిలో పడకేసిన పారిశుద్ద్యం

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిన వీధులు దుర్గంధం వెదజల్లుతూ పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దోమలు విపరీతంగా వ్యాప్తి చెందాయని,గ్రామపంచాయతీ చెత్త బండి తిరగకపోవడంతో వాటర్ ట్యాంక్ దగ్గర,బస్టాండ్ ఎదురుగా,రోడ్లమీద ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆరోపిస్తున్నారు.

 Dengue Fever Shaking The District Sanitation In Garidepally, Dengue Fever ,surya-TeluguStop.com

ఒకవైపు జిల్లాను డెంగ్యూ ఫీవర్ వణికిస్తుంటే ఇక్కడ పారిశుద్ధ్యం ప్రజలను పరేషాన్ చేస్తుందని,ఇలాగే ఉంటే మండల కేంద్రం మంచం పట్టడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రోడ్లమీద చెత్త దగ్గరకు వచ్చే కోతులు వాహనదారుల మీద దాడికి దిగడంతో భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.

మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులు ఉన్నప్పటికీ సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోగాల బారినపడిన తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టినా ఉపయోగం లేదని,ఇప్పటికైనా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు చొరవ తీసుకొని మండల కేంద్రంలో ఉన్న చెత్తాచెదారం కుప్పలను తొలగించి,నీళ్లు నిలువ ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లించి,పరిసరాల పరిశుభ్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube