ఈ మూడింటిని వాటర్ లో కలిపి నిత్యం తీసుకుంటే మీ శరీరంలో సగం రోగాలు పరారవుతాయి!

సాధారణంగా మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు.డే ను రిఫ్రెషింగ్ గా స్టార్ట్ చేయడానికి టీ, కాఫీ వంటి పానీయాలు ఉత్తమంగా సహాయపడతాయి.

 If You Take This Drink Regularly, Half Of The Diseases In The Body Will Disappea-TeluguStop.com

కానీ వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రమే.అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను నిత్యం ఉదయం తీసుకుంటే మీ శరీరంలో సగం రోగాలు పరారవుతాయి .మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Coriander Seeds, Dry Ginger, Tips, Healthy, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో పది నుంచి పదిహేను లవంగాలు మరియు రెండు శొంఠి కొమ్ములు వేసి అర నిమిషం ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ధనియాలు, లవంగాలు మరియు శొంఠి ( Dry ginger )వేసుకొని పొడిలా గ్రాండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో పావు టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి వేసి బాగా కలపాలి.ఈ డ్రింక్ ను ఉదయం టీ కాఫీలకు బదులుగా తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ముఖ్యంగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.క్రమం తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను కరిగించడంలో మరియు హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుండె జబ్బు( Heart disease )ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Telugu Coriander Seeds, Dry Ginger, Tips, Healthy, Latest-Telugu Health

ధనియాలు, లవంగాలు, శొంఠి లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో తోడ్పడతాయి.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడు రుగ్మతల నుంచి కాపాడుతాయి.

అంతేకాదు పైన చెప్పుకున్న డ్రింక్ మంచి జీర్ణక్రియ( Digestion )ను ప్రోత్సహిస్తుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్య నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

అదే సమయంలో జలుబు దగ్గు వంటి సమస్యలకు కూడా ఈ డ్రింక్ ఔషధంలా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube