సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల( Nadigudem mandal ) కేంద్రంలో గ్రూప్స్ అభ్యర్థుల కోసం డీఎస్సీ( DSC ) పెంచాలని నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి తరలించారు.సోమవారం ఉదయం స్టేషన్ వెలుపల డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని,అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3( Group 2 Group 3 ) పోస్టుల సంఖ్య పెంచాలని పరీక్షా తేదీలు డిసెంబర్ వరకు తొలగించాలని,అలాగే ప్రభుత్వం డీఎస్సీ సుమారు 23 వేల పోస్టులు భర్తీ చేయాలని,మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అక్రమ అరెస్టు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు మేకల వీరబాబు,డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు జమ్మి ఎల్లయ్య, మండల నాయకులు నోసిన అంజి,ఎస్ఎఫ్ఐ నాయకులు కామల్ల ప్రవీణ్,గోలి త్రినేష్ తదిరులు పాల్గొన్నారు.