ఈరోజుల్లో ఫొటోలు, రీల్స్ కోసం ప్రజలు పిచ్చి పనులు చేస్తున్నారు.ముఖ్యంగా రైలు ట్రాక్‌లపై ఫోటోలు తీసుకోవడం చాలా ప్రమాదకరమని తెలిసినా జనాలు అలానే వాటిపైకి వెళ్లిపోతున్నారు.
ట్రాక్‌లపైకి ట్రైన్‌లు ఎప్పుడైనా రావచ్చు.అవి ఢీ కొట్టే ఛాన్స్‌లు చాలా ఎక్కువ.
ఇప్పటికే చాలా మంది ఇలాంటి పిచ్చి పనులు చేసి చనిపోయారు.మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం మధ్యాహ్నం రాజస్థాన్( Rajasthan )లోని పాలి జిల్లాలో ఇలాంటి ఓ షాకింగ్ సంఘటన జరిగింది.ఇక్కడ ఉన్న హెరిటేజ్ బ్రిడ్జ్‌పై ఒక జంట ఫోటో షూట్ చేస్తూ ఉండగా ట్రైన్ వచ్చింది.
ట్రైన్ వస్తున్నట్లు గమనించిన ఆ జంట భయంతో 90 అడుగుల లోతు గొయ్యిలోకి దూకింది.ఆ దంపతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.వివరాల్లోకి వెళితే రాజస్థాన్‌లోని బాగ్దీ నగర్‌కు చెందిన 22 ఏళ్ల రాహుల్ మేవాడా, అతని భార్య 20 ఏళ్ల జాన్వి గోర్మ్ఘాట్‌కు బైక్‌పై వెళ్లారు.
అక్కడ వారు మీటర్ గేజ్ రైలుకు చెందిన హెరిటేజ్ బ్రిడ్జ్‌పై( Heritage Bridge ) ఫోటో షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే, వారు ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒక ట్రైన్ ఆకస్మికంగా వచ్చింది.
భయంతో వాళ్లు బ్రిడ్జ్ పై నుంచి దూకారు.దీని వల్ల వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాహుల్‌కు వెన్నుముకలో గాయాలు కావడంతో అతనిని మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్‌కు తరలించారు.జాన్వికి లెగ్ ఫ్రాక్చర్ అయింది.ఆమె బాంగార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియా( Social media )లో షేర్ చేశాడు.ఆ వీడియోలో జంట ఒకరినొకరు పట్టుకుని ట్రైన్ వస్తున్నప్పుడు బ్రిడ్జ్ నుంచి దూకుతున్నట్లు కనిపిస్తుంది.ట్రైన్ వస్తున్నట్లు గమనించిన రాహుల్ సోదరి, బావమరిది పారిపోయి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై అజ్మీర్ రైల్వే డివిజన్ సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ సునీల్ కుమార్ మహలా స్పందించారు.బ్రిడ్జిపై ఉన్న జంటను చూడగానే రైలు డ్రైవర్ బ్రేకింగ్ ప్రారంభించాడని చెప్పారు.
బ్రిడ్జిపై రైలు ఆగినప్పటికీ.భార్యాభర్తలు భయపడి దూకడంతో వారికి గాయాలయ్యాయని అన్నారు.