తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరిపోతుండడం, రోజురోజుకు బీఆర్ఎస్ బలహీనం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
దీంతో పాటు తెలంగాణ విభజన తరువాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ , ఆ పార్టీని మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు , సీఎం రేవంత్ రెడ్డి.ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనేక ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ కమిషన్ లను రేవంత్ రెడ్డి నియమించారు.
గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిని బయటకు తీసి, ప్రజలకు బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో అవినీతి చేశారు అనేది నిరూపించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు .దీనిలో భాగంగానే చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు , యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నియమించారు.
ఈ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసిఆర్( KCR ) ఇష్టపడకపోవడం తో పాటు, తాజాగా ఈ కమిషన్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించకపోవడంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై జస్టిస్ చంద్ర చూడ్ , జస్టిస్ పార్టీ వాలా , జస్టిస్ మనోజ్ మిత్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.పవర్ కమిషన్ ఏర్పాటు నిబంధనల ఉల్లంఘనేనని, ఈ కమిషన్ కు అధిపతిగా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు ముందే తమకు వ్యతిరేకంగా కొన్ని వివరాలను మీడియాకు లీక్ చేశారని , దీంతో నరసింహారెడ్డి ఆ బాధ్యతల్లో కొనసాగలేరంటూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసిఆర్ పిటిషన్ ను తోసిపుచ్చింది.జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు విషయంలో నిబంధనలు మేరకే కమిషన్ నోటీసులు జారీ చేసిందని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది .దీంతో తమ ఎదుట హాజరు కావాలని కమిషన్ కేసిఆర్ కు నోటీసులు ఇవ్వడం పై , హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.నేటి విచారణలో ఏం చేయాలనుంది అనేది ఆసక్తికరంగా మారింది.