బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించేది.ముఖ్యంగా అమితాబచ్చన్, ధర్మేంద్ర, రాజేష్ కన్నా లాంటి నటులు భారీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించేవారు.
ఇంకా అప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే, బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం పెద్ద ఇండస్ట్రీ గా గుర్తింపు పొందడమే కాకుండా అక్కడ ఉన్న సినిమాలకి రీచ్ ఎక్కువగా ఉండేది.అందువల్ల అమితాబచ్చన్,( Amitabh Bachchan ) ధర్మేంద్ర,( Dharmendra ) రాజేష్ కన్నా( Rajesh Khanna ) లాంటి స్టార్ హీరోల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది దేశవ్యాప్తంగా సంచలనలను క్రియేట్ చేసేది.
ఇక అదే టైంలో ఈ ముగ్గురికి పోటీ ఇస్తు మరొక హీరో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించడనే విషయం మనలో చాలా మందికి తెలియదు.ఆయన ఎవరు అంటే సంజీవ్ కుమార్.( Sanjeev Kumar ) అప్పట్లో అమితాబచ్చన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఆయన గుర్తింపు పొందాడు.ఇక బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఆరు సినిమాలతో సక్సెస్ లను అందుకొని స్టార్ డమ్ అందుకోవడమే కాకుండా స్టార్ హీరో స్టేటస్ ని కూడా అనుభవించాడు.
ఇక ఈయన తన కెరియర్ లో అలి బాబా 40 చోర్ ,( Ali Baba 40 Chor ) కలాపి,( Kalapi ) స్మగ్లర్, రాజ్ ఔర్ రంక్, అంగూర్, గౌరీ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు.ఇక కొద్దిరోజుల పాటు స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఆయనకు సరైన సక్సెస్ లు రాలేదు.
దానివల్ల హీరోగా ఫెడౌట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.ఇక అసలు విషయం ఏంటి అంటే ఈయన చాలా చిన్న ఏజ్ లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ముసలి గెటప్ లో కూడా నటించాడు.
ఇక 47 ఏళ్లకే ఆయన గుండెపోటుతో( Heart Attack ) మరణించడం అనేది నిజంగా అప్పటి ప్రేక్షకులందరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది.ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి సేవలను అందిస్తాడు అనుకున్న ఆయన చిన్న ఏజ్ లోనే మరణించడం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి.ఇక సంజీవ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాత, తండ్రి, తమ్ముడు, తను ఎవరు కూడా 50 సంవత్సరాల వరకు బతకలేదట.అందరూ 50 సంవత్సరాలు లోపే మరణించారు.ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా 50 సంవత్సరాలు వరకు బతకలేరు అనేలా వీళ్ళందరూ ఆలోపే మరణించడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది…
ఇక ఇదే విషయాన్ని సంజీవ్ కుమార్ కూడా తను బతికున్నప్పుడు ఒకసారి ప్రస్తావించాడు.ఒక రిపోర్టర్ మీరు ఇంత చిన్న ఏజ్ లో ముసలి క్యారెక్టర్స్ ఎందుకు వేస్తున్నారు అని అడిగారు.దానికి సమాధానం గా తను ముసలితనన్ని చూడలేను.అప్పటి వరకు ఉంటానో లేదో అందుకే ఇప్పుడే వృద్ధాప్య క్యారెక్టర్ లను కూడా చేస్తున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు.
అంటే ఇతనికి ముందే వాళ్ళ తాత, నాన్న చనిపోయారు కాబట్టి తను కూడా అలాగే చనిపోతాననే ఉద్దేశ్యం తనకి కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.