పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమే.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతీ ఒక్క పోలీస్ అధికారి శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని, శారీరకంగా దృడంగా ఉన్నపుడే విధులు సక్రమంగా నిర్వహించగలరని, అందులో భాగంగానే జిల్లా పోలీస్ అధికారులకు అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్(వ్యాయమ శాల) అందుబాటులోకి తీసుకరవడం జరిగిందన్నారు.సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిమ్ ని పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ.

 Police Officers And Staff To Be Healthy Along With Their Duty District Sp Akhil-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే సిబ్బందికి ,విధులతో పాటుగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆకాంక్షించారు.జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారుల సంక్షేమనికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు , సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటానికి ఈ జిమ్ అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని అన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక,వ్యాయామం, యోగ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు.

పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిమ్ కోచ్ తో సహా అత్యాధునిక జిమ్ (వ్యాయమ శాల) అందుబాటులోకి తీసుకవచ్చిన జిల్లా ఎస్పీ కి అధికారులు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,ఆర్.

ఐ లు మాధుకర్, యాదగిరి, సి.ఐ కృష్ణ, మోగిలి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube