ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. చంద్రబాబే స్వయంగా వెళ్లి 

ఏపీలో పెన్షన్ల సందడి మొదలైంది.ఈరోజు ఉదయం నుంచి వృద్ధులు , వికలాంగులకు వారి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ( AP Govt )మొదలు పెట్టింది.

 Chandrababe Himself Went To The Pension Festival In Ap Today, Ap Government, Ap-TeluguStop.com

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను 4 వేలకు పెంచి ఇస్తున్నారు.ఏప్రిల్ నుంచి ఈ పెరిగిన పెన్షన్ మొత్తాన్ని జులై ఒకటో తేదీన అందిస్తామని టిడిపి చంద్రబాబు( TDP Chandrababu ) ప్రకటించిన హామీ మేరకు,  ఈరోజు మొత్తం 700 రూపాయలు పెన్షన్ను వృద్ధులకు స్వయంగా వారి ఇళ్ళ వద్దకే సచివాలయ ఉద్యోగులు వెళ్లి అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

Telugu Ap-Politics

 అలాగే దివ్యాంగులకు ఈనెల 15 వేల రూపాయలను పెన్షన్ గా అందించారు.గత వైసిపి ప్రభుత్వంలో వాలంటీర్లు ఏ విధంగా అయితే పెన్షన్ దారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించారో , అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు అందించాలని ఆదేశాలు జారీ కావడంతో,  ఈరోజు తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు నిమగ్నం అయ్యారు.వృద్ధులకు ఒక్కొక్కరికి ₹7,000 పెన్షన్ అందడంతో,  వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.  పెన్షన్ సొమ్ముతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన లేఖను లబ్ధిదారులకు అందిస్తున్నారు.

ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 గృహాలను కేటాయించారు.ఏపీలో మొత్తం 65.12 లక్షల మంది పెన్షన్ దారులకు 7000 రూపాయలు చొప్పున అందించే కార్యక్రమం మొదలైంది .దీనికోసం ప్రభుత్వం 4, 408 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.

Telugu Ap-Politics

ఇక సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు.తాడేపల్లి( Tadepalli ) మండలం పెనుమాక గ్రామంలో ఓ లబ్ధిదారుడికి స్వయంగా చంద్రబాబు పెన్షన్ ను అందించారు.రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్  కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఆయా గ్రామాల్లోని టిడిపి నేతలు పాల్గొని లబ్ధిదారులతో ఫోటోలు తీసుకుని పండుగలా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube