ఇటీవలే మొదలైన కొత్త సంవత్సరం చూస్తుండగానే అప్పుడే ఆరు మాసాలు పూర్తి చేసుకుంది.ఈ ఆరు మాసాలలో ఎన్నో సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్( box office ) వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ గా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.మరి ఇప్పటివరకు ఏఏ సినిమాలు విడుదల అయ్యాయి అందులో ఎన్ని విజయం సాధించాయి అన్న వివరాల్లోకి వెళితే.
ఈ ఏడాది ఆరంభంలో జనవరి 1న సర్కారు నౌకరి సినిమా విడుదలైన విషయం తెలిసిందే.సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
తర్వాత.దీనమ్మ జీవితం, 14 డేస్ లవ్, ప్రేమకథ, రాఘవ రెడ్డి, డబుల్ ఇంజిన్ లాంటి చిన్న చిన్న సినిమాలు విడుదల అయ్యి పరాజయాన్నే అందుకున్నాయి.ఎప్పటిలానే ఈ సంక్రాంతి సీజనూ ఆసక్తికర పోటీకి దారి తీసింది.గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్, హనుమాన్ ఇలాంటి సినిమాలు విడుదల అవ్వగా, ఇందులో హనుమాన్ సినిమా( Hanuman movie ) మంచి సక్సెస్ సాధించడంతో పాటు ఇప్పటివరకు టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది.ఈ సినిమా వసూళ్లు రూ.300 కోట్లకుపైనే.తరువాత రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ర్యాపిడ్ యాక్షన్ మిషన్, బిఫోర్ మ్యారేజ్ వంటి సినిమాలు ఏమాత్రం సందడి చేయలేక పోయాయి.
ఆ తరువాత ఫిబ్రవరి మొదటి వారంలో సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు( Ambajipet Marriage Band ), కిస్మత్, హ్యాపీ ఎండింగ్, బూట్‌కట్ బాలరాజు,గేమ్ ఆన్ వంటివి విడుదల అయినప్పటికీ వీటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ సినిమా సత్తాను చాటు లేదు.
ఆ తర్వాత వచ్చిన ఈగల్, యాత్ర 2( Eagle, Yatra 2 ) సినిమాలు పరవాలేదు అనిపించాయి.ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది.
ఇక ఫిబ్రవరి చివరి వారంలో విడుదలైన మస్తు షేడ్స్ ఉన్నాయి రా,రాజధాని ఫైల్స్, సిద్ధార్థ్ రాయ్ సినిమాలు ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయాయి.వైవా హర్ష కథానాయకుడిగా పరిచయమైన సుందరం మాస్టర్ ప్రేక్షకులను నవ్వించింది.
ఇక మార్చి మొదటి వారంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమా విడుదల కాగా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
రెండో వారం బీమా,గామి లాంటి సినిమాలు విడుదల అయ్యియి.ఇక మూడవ వారంలో రజాకార్,లంబసింగి, షరతులు వర్తిస్తాయి, వెయ్ దరువెయ్ ఇలా దాదాపు అరడజన్ కు పైగా సినిమాలు విడుదల అయ్యాయి.ఇక మార్చి చివరి వారంలో టిల్లు స్క్వేర్ సినిమా( Tillu Square movie ) విడుదల అయ్యే మంచి సక్సెస్ సాధించింది.
ఇక ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అయినా ఫ్యామిలీ స్టాల్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత వచ్చిన భరతనాట్యం, బహుముఖం, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి.
ఆ తరువాత పలువురు హీరోలు విభిన్న కోణాలు ఆవిష్కరించిన చిత్రాలు మే, జూన్‌లో విడుదలయ్యాయి.
అవి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి.కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ నటించిన వినోదాత్మక చిత్రం ఆ ఒక్కటీ అడక్కు.కామెడీ టైమింగ్‌లో ఒకప్పటి నరేశ్ కనిపించినా నవ్వులు పెద్దగా పండలేదు.
దీంతో పాటు విడుదలైన ప్రసన్న వదనం, కేరాఫ్ కంచరపాలెం, ఆరంభం సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చాలానే విడుదల అయినప్పటికీ అవి ఏవి కూడా సక్సెస్ కాలేకపోయాయి.
ఆ తర్వాత విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బేబీ సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి.ఆనంద్ దేవరకొండ గం.గం.గణేశా( gam.gam.Ganesha ) సినిమాతో మంచి వినోదం పంచారు.ఈనెల ఆరంభంలో లవ్ మౌళి,మనమే, సత్యభామ,ప్రేమించొద్దు, రక్షణ లాంటి సినిమాలు విడుదల అయ్యాయి.ఇందులో మనమే సినిమా తప్ప మిగిలినవి ఏవి మెప్పించలేకపోయాయి.ఇక తాజాగా కల్కి సినిమా ( Kalki movie )విడుదల అయ్యి మంచి సక్సెస్‌ను సాధించింది.అయితే కల్కి సినిమా బరిలో ఉండడంతో చిన్న సినిమాలు ఏవి కూడా విడుదల అయ్యే సాహసం చేయలేదు.