ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మారుమోగుతున్న పేర్లలో డైరెక్టర్ పేర్లలో నాగ్ అశ్విన్ ( Nag Aswin ) కూడా ఒకటి. కల్కి సినిమాని ( Kalki Movie ) ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో అశ్విన్ పేరు పెద్ద ఎత్తున మారుమోగుతుంది.ఇప్పటివరకు ఈయన చేసినది రెండు సినిమాలే కానీ మూడో సినిమానే ఈ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై అలాగే డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
నాగ్ అశ్విన్ తల్లితండ్రులు ఇద్దరు వృత్తిపరంగా వైద్యులే అయినప్పటికీ సినిమాపై మక్కువతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు.అనంతరం మహానటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.అయితే మొదటి రెండు సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా జాతీయ స్థాయి అవార్డును కూడా అందుకున్నారు.
ఇక ముచ్చటగా మూడోసారి కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.
ఇలా దర్శకుడుగా రాజమౌళి,సుకుమార్ స్థాయికి చేరుకున్నటువంటి నాగ్ అశ్విన్ కి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.అయితే దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించారని ఒక వార్త వైరల్ అవుతుంది.
మరి ఈయన ఏ సినిమాలలో నటించారనే విషయానికి వస్తే మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాతో( Nenu meeku telusa ) పాటు లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు.అయితే ఈయన శేఖర్ కమ్ముల ( Sekhar Kammula ) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో నటించారు